Ragi Groundnut Laddu: ఈ లడ్డూను రోజుకొకటి తినండి!.. మోకాళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పండి

by Kavitha |   ( Updated:2024-07-22 15:30:06.0  )
Ragi Groundnut Laddu: ఈ లడ్డూను రోజుకొకటి తినండి!.. మోకాళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పండి
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత సమాజంలో లభించే ఆహారం చాలా వరకు కల్తీగానే ఉంటుంది. ఎంత ఖరీదైన ఫుడ్ తీసుకున్నా వాటిల్లో విటవిన్స్, ప్రొటీన్స్ దొరకడం అరుదనే చెప్పాలి. ఈ కారణంగా చిన్న వయసులోనే అనేక రకాల రోగాల బారిన పడుతుంది నేటి యువత. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పుల వల్ల ఏ పనిని సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. కాసేపు నడవడానికి, నిలబడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి రకరకాల మందుల వాడుతూ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయినా రిజల్ట్స్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అయితే రాగి లడ్డూను తినడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని న్యూట్రిషనిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ రాగి లడ్డూను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి- ఒక కప్పు

వేరుశనగలు- ఒకటిన్నర కప్పులు

బెల్లం- ఒక కప్పు

నెయ్యి- 3 టేబుల్ స్పూన్లు

యాలకులపొడి- హాప్ టేబుల్ స్పూన్

నీరు- కొద్దిగా

లడ్డు తయారీ విధానం:

దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు రాగి పిండి వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో ఒకటిన్నర కప్పు వేరుశనగలు వేసి వేయించుకొని పొట్టు తొలగించి కాస్త బరకగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లంలో( Jaggery ) కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి. తీగపాకం రాగానే రాగి పిండి, వేరుశనగ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని స్టోర్ చేసుకోవాలి.

ఉపయోగాలు, లభించే ప్రోటీన్స్:

* ఈ రాగి లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మోకాళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రాగి లడ్డూలలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

* అదే విధంగా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అలాగే ఎముకలు బలహీనంగా, పెలుసుగా మారకుండా అడ్డుకుంటుంది. మోకాళ్ల నొప్పులను సమర్థవంతంగా వదిలిస్తుంది.

* కాబట్టి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రాగి లడ్డూను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి. పైగా ఈ రాగి లడ్డు మంచి జీవక్రియకు మద్దతు ఇస్తుంది. మధుమేహం వచ్చే రిస్క్‌ని తగ్గించడంతో పాటు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

Read more...

Tomato: ఈ చిట్కాలతో టమాటాలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు


Advertisement

Next Story

Most Viewed