- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగిపోయిన భూమి లోపలి కోర్ భ్రమణం.. ముప్పు పొంచి ఉందా?
దిశ, ఫీచర్స్: భూమి లోపలి ప్రాంతం ఒక రహస్య ప్రదేశం. అయితే ఇందుకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను కనుగొన్నారు పరిశోధకులు. తాజా అధ్యయనం ప్రకారం దశాబ్దాల సుదీర్ఘ చక్రంలో భాగంగా భూమి అంతర్గత కోర్(ఇన్నర్ కోర్) తిరగడం ఆగిపోయిందని గుర్తించారు. ఈ కోర్ సూపర్ అయానిక్ ఐరన్ అల్లాయ్‌గా ఉండే అవకాశం ఉందంటున్నారు.
భూమి ఉపరితలంతో పోలిస్తే, దాని లోపలి కోర్ 2009లో తిరుగుతూ ఆగిపోయింది. ఇది సాధ్యమే అంటున్న సైంటిస్టులు.. ఎందుకంటే ఇన్నర్ కోర్ అనేది లిక్విడ్ ఔటర్ కోర్‌లో తేలియాడే సాలిడ్ ఐరన్ బాల్ లాంటిదని చెప్తున్నారు. భ్రమణం తప్పనిసరిగా మిగిలిన గ్రహంతో ముడిపడి ఉండదని వివరించారు పెకింగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. 1960ల నుంచి అంతర్గత కోర్ గుండా భూకంపాల నుంచి వచ్చే భూకంప తరంగాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ తరంగాలు ఎలా కనిపిస్తున్నాయి? అవి ప్రోపగేట్ అయ్యేందుకు ఎంత సమయం పట్టింది? అనే తేడాలను పరిశోధించారు. ఆశ్చర్యకరంగా దశాబ్దాలుగా ఈ తరంగాల ప్రయాణ సమయాలు నిర్దిష్ట మార్గాల్లో మారుతున్నాయని కనుగొన్నారు. కానీ, దాదాపు 2009 తర్వాత ఆ వైవిధ్యం పూర్తిగా అదృశ్యమైంది. ప్రయాణ సమయాలు స్థిరంగా ఉన్నాయి. ఇది కోర్ భ్రమణం 'పాజ్ చేయబడింది' అని సూచిస్తుందని బృందం పేర్కొంది. అలాగని అసలు స్పిన్నింగ్ ఉండదని అర్థం కాదన్న శాస్త్రవేత్తలు.. అంతర్గత కోర్ మందగించే భ్రమణం ఉపరితలంతో పోలిస్తే వెనక్కి కూరుకుపోతున్నట్లు కనిపిస్తుంది.
పరిశోధకుల ప్రకారం.. ఇదంతా 70 సంవత్సరాల చక్రంలో భాగం. మునుపటి తిరోగమనం 1970ల ప్రారంభంలో జరిగింది. ఇది భూమి చక్రాలలో అయస్కాంత క్షేత్రం, రోజు పొడవు వంటి ఇతర గమనించిన మార్పులతో కూడా సమానంగా ఉండవచ్చు. ఈ చక్రం కారణం అనేక ప్రధాన పోటీ శక్తులు కావచ్చు. బాహ్య కోర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం లోపలి కోర్ స్పిన్‌ను వేగవంతం చేస్తుంది. అయితే మాంటిల్ భారీ గురుత్వాకర్షణ ప్రభావం దానిపైకి లాగి, స్పిన్‌ను నెమ్మదిస్తుంది.