- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షంలో టూవీలర్ నడుపుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి టూ వీలర్ ఉంటుంది. అంతే కాదు.. టూవీలర్ నడపడం చాలా మందికి ఓ ప్యాషన్. దీంతో ఎండ, వాన, చలి అని తేడా లేకుండా బ్రైక్ డ్రైవ్ చేస్తుంటారు. సాధారణ బైక్ డ్రైవింగ్‌కు, వానలు పడినప్పుడు డ్రైవింగ్‌కు చాలా తేడాలు ఉంటాయి. బైక్ నడపడంలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వర్షకాలంలో బైక్‌పై గ్రిప్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షంలో ఎక్కువగా బైక్‌లు, స్కూటీలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
అందుకే, స్కూటీ, బైక్ లాంటి ద్విచక్ర వాహనాలపై వెళుతున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు నగరాల్లో కొన్ని చోట్ల రోడ్లు గుంతలు పడతాయి. వర్షపు నీటికి అవి కనిపించవు. అయితే.. ఫోర్ వీలర్ ఉపయోగించిన వారి కంటే టూవీలర్ వారికి ఈ గుంతల కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరి మీరు కూడా బైక్, స్కూటీ నడుపుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోవాల్సిందే.
వర్షంలో స్కూటీ, బైక్ నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* నిజానికి మీరు ఎంతో మంచి డ్రైవర్ అయుండచ్చు. కానీ, వర్షాకాలంలో బైక్ నెమ్మదిగా నడపడం ఎంతో మంచిది. ఎందుకంటే.. సడెన్‌గా మీరు బ్రేక్ వెయ్యాల్సి వస్తే అది స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
* వర్షం పడేటప్పుడు బైక్ వేసుకుని బయటకు వెళ్లాలి అనుకుంటే ముందుగా టైర్లపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీ టైర్ల గ్రిప్ అరిగిపోయినట్లయితే రోడ్లపై సులభంగా జారిపోతుంది. అలాగే టైర్లలో గాలిని కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
* ముఖ్యంగా మీ ముందు వెళ్లే వాహనానికి మీకు కొంచెం దూరం పాటించాలి. అంతేకాకుండా ఓవర్ లోడ్ వాహనాలకు దూరంగా ఉండాలి. అలాగే బైక్ హెడ్ లైట్స్ కూడా ఆన్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే వర్షంలో బైకులు సరిగా కనిపించవు కాబట్టి ఆ లైట్ ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి.
* బ్రేకులు తప్పని సరిగా చెక్ చేసుకోవాలి. పైగా వర్షాకాలంలో ఫ్రెంట్ బ్రేక్‌ల కంటే వెనుక బ్రేక్ మంచిది. ఫ్రెంట్ బ్రేక్‌తో వాహనం స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే వెనుక బ్రేక్ అయితే స్కిడ్ కాకుండా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
* గతుకులున్న రోడ్లపై వర్షాకాలంలో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండిపోతాయి. ఆ సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఫోర్ వీలర్ అయితే బ్యాలెన్స్ ఆపుకోవడానికి వీలుగా ఉంటాయి. కానీ టూ వీలర్ చిన్న గోతులో సడెన్‌గా పడినా స్కిడ్ అవుతుంది. కాబట్టి వాటర్‌తో నిండి ఉన్న రోడ్లపై ప్రయాణం చేయకుండా ఉండటమే బెటర్.
ఇవి కూడా చదవండి:
బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును.. ఎక్కడో తెలుసా?