Black Gram: నల్లగా ఉన్నాయని తక్కువ అంచనా వేయకండి.. ఇదో పోషకాల పుట్ట!!

by Kanadam.Hamsa lekha |
Black Gram: నల్లగా ఉన్నాయని తక్కువ అంచనా వేయకండి.. ఇదో పోషకాల పుట్ట!!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. సరైన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే మినుములను తినాలి. చూడడానికి నల్లగా కనిపించినా.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒకప్పుడు వీటిని ఆహారంలో భాగంగా ప్రతి రోజూ తీసుకునే వారు. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్ సీ, బీ1, బీ3, కాల్షియం, ఐరన్ వంటివి మెండుగా ఉంటాయి. మినుముల్లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. మాంసాహారం తినని వారికి మినుములు చక్కటి పోషణను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

* వీటిని రోజులో కనీసం 2 లేదా 3 సార్లు అయినా ఆహార పదార్థాలలో ఉపయోగించాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది. గట్ బ్యాక్టీరియా తయారీ కోసం ఇది సహాయపడుతుంది.

* ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి, రక్తహీనతను దూరం చేయడంలో ఉపయోగపడుతాయి.

* శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలన్నా.. విరిగిన ఎముకలు, కీళ్లవాతం ఉన్న వారికి ఇది ఒక మంచి మెడిసిన్ అని నిపుణులు చెబుతున్నారు.

* అంతేకాదు మినుములతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల చర్మానికి పోషణ అందుతుంది.

* మినుముల్లోని పొటాషియం, పీచుపదార్థాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సంజీవనిలా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

* మినుములను రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

వారంలో 3 సార్లు అయిన ఈ మినుములతో ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినడం వల్ల హెల్తీగా ఉంటారు. మినుములతో చేసిన సున్నుండలు రోజులో ఒకటి అయినా తినడం వల్ల శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed