Green tea: గ్రీన్ టీ టేస్ట్ నచ్చట్లేదా? వీటిని కలుపుకుని తాగండి

by Anjali |   ( Updated:2024-09-21 11:00:22.0  )
Green tea: గ్రీన్ టీ టేస్ట్ నచ్చట్లేదా? వీటిని కలుపుకుని తాగండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు గ్రీన్ టీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు అనేకం. గుండె జబ్బులు నయం చేయడంలో ఈ టీ ముందుంటుంది. అంతేకాకుండా గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి కాపాడుతుంది. గుండెలో కొవ్వు శాతం తగ్గిస్తుంది. గుండె, హోల్స్‌ను క్లీన్ చేయడంలో తోడ్పడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పి, కీళ్లవాతం సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారికి ఫస్ట్ గుర్తొచ్చేది గ్రీన్ టీనే.

ఎప్పుడైనా సరే గ్రీన్ ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. టానిన్లు అని పిలువబడే పాలీఫెనాల్స్ కడుపులో ఆమ్లాన్ని పెంచి. కడుపు నొప్పి, వికారం, మండే అనుభూతి లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. కాగా భోజనం మధ్య లేదా భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిది. మార్నింగ్ ఈ టీ తాగడం వల్ల కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. గ్రీన్ టీని ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు కూడా తీసుకోవచ్చు.

అయితే గ్రీన్ టీ రుచి కాస్త చేదుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా పలు పదార్థాలు దీనిలో కలిపి తీసుకుంటే గ్రీన్ టీ రుచిని మెరుగుపర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నిమ్మరసం..

గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల రుచిని పెంచుకోవచ్చు. కేవలం రుచి మాత్రమే కాకుండా నిమ్మరసం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసం గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఆపిల్ సిడర్ వెనిగర్

ఆపిల్ సిడర్ వెనిగర్ గ్రీన్ టీలోని జిడ్డును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆపిల సిడర్ వెనిగర్ టేస్ట్ తియ్యగా, పుల్లగా ఉంటుంది. గ్రీన్ టీలో దీన్ని మిక్స్ చేసి తీసుకుంటే రుచిని పెంచుతుంది. పూర్తి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఎర్ర ద్రాక్షలు..

మార్కెట్లో లభించే ఎర్ర ద్రాక్షల్ని గ్రీన్ రెడీ చేసుకొనేటప్పుడు అందులో మరిగించాలి. దీంతో ద్రాక్ష రుచిని గ్రీన్ టీకు ఇస్తుంది. గ్రీన్ టీకు ఉండే ఆస్ట్రింజిని కూడా తగ్గించి.. టేస్ట్‌ను పెంచుతుంది. డయాబెటిస్ పెషేంట్లకు గ్రీన్ టీ దివ్యౌషధం. అంతేకాకుండా గ్రీన్ టీ మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed