- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్లిమ్‌గా ఉన్నామని మురిసిపోకండి.. ఇలాంటి వారిలోనూ కొవ్వు ఎక్కువేనట !
దిశ, ఫీచర్స్: మీరు స్లిమ్‌గా ఉన్నామని, అధిక బరువు లేనందున ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని మురిసిపోతున్నారా? అయితే ఆలోచన మార్చుకోండి! ఎందుకంటే సన్నగా ఉన్నంత మాత్రానా శరీరంలో కొవ్వులేదని భావించడం కరెక్ట్ కాదు. కొందరు ఇలా ఉన్నప్పటికీ శరీరంలో హానికరమైన ఫ్యాట్ ఎక్కువగా కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే వైద్య పరమైన నిర్ధారణలు లేకుండా బయటకు కనిపించే శరీరాన్ని బట్టి ప్రాబ్లం లేదనుకుంటే మోసపోయే అవకాశం ఉంది.
ఒక వ్యక్తి హెల్తీ బాడీ మాస్ ఇండెక్స్ (18.5-24.9 మధ్య) కలిగి ఉండవచ్చు. కానీ తరచూ అన్‌హెల్తీ డైట్స్ తీసుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు, ఎటువంటి శారీరక శ్రమలేకపోవడం వంటి జీవన శైలివల్ల పొత్తికడుపులో హానికరమైన ఫ్యాట్ దాగి ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు. దీనినే టోఫీ(thin-outside-fat-inside) అని కూడా పిలుస్తారు. దీంతోపాటు కాళ్లు, చేతులు, స్కిన్‌లోపలి పొరల్లో కూడా కొందరికి కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.
ఈ పరిస్థితిని ‘సబ్ క్యుటనియస్ ఫ్యాట్’గా పేర్కొంటారు. ఇలా పైకి బక్కగా కనిపిస్తూనే పొత్తికడుపులో, చర్మ భాగాలలో లోపల దాగి ఉండే కొవ్వును వైద్య పరిభాషలో ‘విసెరల్ ఫ్యాట్’ అంటారు. ఇది క్రమంగా డయాబెటిస్, హై బీపీ, ఒబేసిటీ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే గాల్ బ్లాడర్, ఓవరీన్, ఎండోమెట్రియల్, ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్లకు కారణం అవుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక పేర్కొంటున్నది. అందుకే మీ బాడీ ఆకారాన్ని బట్టి ఫిక్స్ అవకూడదు. మెడికల్ టెస్టులను బట్టి ఫ్యాట్ లెవల్ తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More: వయస్సులో ఉండికూడా సెక్స్ చేయలేకపోతున్నారట.. కారణం ఏంటంటే..?
- Tags
- health tips