Yoga in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ యోగాసనాలు అద్భుతం చేస్తాయి.. వందశాతం నార్మల్ డెలివరీ పక్కా !

by Javid Pasha |
Yoga in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ యోగాసనాలు అద్భుతం చేస్తాయి.. వందశాతం నార్మల్ డెలివరీ పక్కా !
X

దిశ, ఫీచర్స్ : యోగా సహజంగానే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. ఆయా ఆసనాలను బట్టి శరీరక దృఢత్వం, మానసిక వికాసం కలుగుతాయని చెప్తారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా వీటిని ప్రయత్నించవచ్చు. అయితే గర్భిణులు కూడా చేయవచ్చా? అనే సందేహాలు చాలా మందికి తలెత్తుతుంటాయి. నిపుణుల ప్రకారం ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రత్యేక యోగాసనాలు చేయడం మంచిది. పైగా వాటివల్ల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఆ యోగాసనాలేవో ఇప్పుడు చూద్దాం.

* బద్ధకోణాసనం: బద్ధకోణాసనం చేయడంవల్ల పాదాలు, నడుము భాగానికి బలం చేకూరుతుంది. అలాగే కటి ప్రాంతంలోని కండరాలు బలపడతాయి. గర్భధారణ తర్వాత మూడవనెల నుంచి ప్రతిరోజూ ఈ ఆసనం చేయడంవల్ల వంద శాతం నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువని నిపుణులు చెప్తున్నారు.

* తాడాసనం : ఇది ఎవరైనా చేయగల సులువైన యోగాసనం. గర్భిణులు కూడా చేయవచ్చు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.

* సుఖాసనం : మానసిక వికాసాన్ని కలిగించే అద్భుతమైన యోగాసనాల్లో సుఖాసనం ఒకటి. దీనిని చేయడంవల్ల ఒత్తిడి, ఆందోళన, గుండె దడ వంటి ఇబ్బందులు పోతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కడుపులో బిడ్డకు తల్లి నుంచి సరఫరా అయ్యే ఆమారం, రక్తం అన్నీ సక్రమంగా అందుతాయని నిపుణులు చెప్తున్నారు.

*వీర భద్రాసనం : గర్భవతులు బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా చేయాల్సిన ఆసనాల్లో వీరభద్రాసనం ఒకటిగా నిపుణులు సూచిస్తున్నారు. రోజూ కనీసం ఐదు నిమిషాలు చేయడంవల్ల శరీరం దృఢంగా మారుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

* వృక్షాసనం : అందరూ చేయగల సులువైన యోగాసనం ఇది. గర్భిణులు చేయడం చాలా మంచిది. అందుకోసం నిటారుగా నిలబడి కుడి తొడ మీద ఎడమ పాదాన్ని ఉంచి, నమస్కరించే భంగిమలో చేతులు జోడించి, ఛాతీపై ఉంచి రెండు కాళ్లు మారుస్తూ అలా 30 సెకన్లపాటు చేయాలి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరం, కండరాలు బలంగా తయారవుతాయి. గర్భిణులు చేయడంవల్ల దాదాపు వందశాతం నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు మెరుగు పడతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించ లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేముందు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed