- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీరంలోని ఈ భాగాల నుంచి చెమట వస్తుందా? అయితే తస్మత్ జాగ్రత్త..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఈ మధ్య ఎక్కడ చూసిన గుండెపోటు వార్తలే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ రావడానికి ముందు కొన్ని లక్షణాలు గుర్తించవచ్చని నిపుణులు చెబుతుంటారు. అజీర్ణం సమస్యలు, ఛాతీ, ఒత్తిడి లేదా నొప్పి, తరచుగా దవడ నొప్పి, భయందోళనకు గురవుతున్న భావన, అలసట, కడుపు సమస్యలు, సిరలు, ధమనుల గడ్డకట్టడం, అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు.. ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది.
నిపుణులు ఏం చెబుతున్నారంటే?
అయితే చెమటలు పట్టడం గుండెపోటుకు ప్రధాన కారణమని తాజాగా నిపుణులు వెల్లడించారు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు విపరీతంగా చెమటలు పట్టడం. చెమటను మనం సాధారణ సమస్యగా భావిస్తాం. కానీ అది గుండెపోటుకు ముఖ్య సంకేతమని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటుకు ముందు శరీరంలోని అనేక భాగాల నుంచి చెమట వస్తుంది. చెమటతో పాటు శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, భయం మరియు ఛాతీలో భారం వంటివి గుండెపోటు యొక్క లక్షణాలు.
ఏ ప్రదేశాల నుంచి చెమట వస్తుందంటే?
సాధారణంగా మన చంకలు, వీపు విపరీతంగా చెమట పడుతుంది. కానీ గుండెపోటు సమస్య వస్తే ముఖం, మెడ, నుదురు మీద చెమట వస్తుంది. అరచేతులు చల్లగా అవుతాయి. అరచేతులు కూడా చెమటలు పడుతూ ఉంటే.. అది కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు.
హార్ట్ ఎటాక్‌కు ముందు చెమట ఎందుకు వస్తుంది?
గుండెపోటుకు ముందు చెమటలు పట్టడానికి శాస్త్రీయ కారణం ఉందంటున్నారు నిపుణులు. శీతాకాలం, వేసవి లేదా వర్షాకాలం ఏదైనా సీజన్‌లో గుండెపోటు వచ్చే ముందు చెమట వస్తుంది. మన ధమనులలో ఫలకం ఏర్పడినప్పుడు అలాగే ఆక్సిజన్ గుండెకు చేరుకోలేనప్పుడు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం చెమటను రిలీజ్ చేస్తుంది. విపరీతమైన చెమట, ఆయాసం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.