చిన్న వయస్సులో అధిక ఒత్తిడి.. జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందా?

by Javid Pasha |
చిన్న వయస్సులో అధిక ఒత్తిడి.. జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందా?
X

దిశ, ఫీచర్స్ : చిన్న వయస్సులో అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం ఆ తర్వాత కాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?.. జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుందా?.. అవుననే అంటున్నారు నిపుపుణులు. చిన్నప్పుడు స్థాయికి మించిన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనుభవాలు మధ్య వయస్సులో గానీ, ఆ తర్వాత గానీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ అధికంగా ఉన్నాయని న్యూయార్క్ సైకాలజిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.

బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ ప్రెజర్, పర్సనల్ ప్రాబ్లమ్స్ వంటివి 30 ఏండ్లలోపు వారిలో ఆందోళనకు, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. అలాగే 18 ఏండ్లలోపు వారిని చదువుకునే సమయంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, సామాజిక ఒంటరితనం వంటివి మానసికంగా కృంగదీస్తున్నాయి. కొందరిని డిప్రెషన్‌లోకి నెడుతున్నాయి. దీని ప్రభావంవల్ల వారు మధ్య వయస్సులోనూ, వృద్ధాప్యంలోనూ అవస్థలు పడాల్సి వస్తుంది.

ముఖ్యంగా జ్ఞాపక శక్తిని బలహీన పర్చడంలో చిన్న వయస్సులో ఎదుర్కొనే అధిక ఒత్తిడి అనుభవాలు కీలకాపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ యూనివర్సిటీ నిపుణులు చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు నిద్ర, ఆకలి, ఏకాగ్రత, సోషల్ ఐసోలేషన్, డిప్రెషన్, సామర్థ్యం, విచారం వంటి అంశాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు యవ్వనంలో డిప్రెషన్‌తో బాధపడినవారు మధ్య వయస్సులో బలహీనమైన జ్ఞాపక శక్తిని కూడా ప్రదర్శించారట. అయితే ఈ డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండటం లేదు. ఆయా వ్యక్తులు పుట్టి పెరిగిన వాతావరణం, ఒత్తిడిని వారు స్వీకరించి, ఫీలయ్యే విధానం వంటివి ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. తమ అధ్యయనం వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియాను అర్థం చేసుకునేందుకు దోహదపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Advertisement

Next Story