- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోస్ట్‌మార్టం సమయంలో అవయవాల తూకం.. అసలు నిజం అదే అంటున్న వైద్యనిపుణులు..
దిశ, ఫీచర్స్ : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మహిళా వైద్యురాలి పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్యకు సంబంధించి పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే అత్యాచారం కేసుల్లో పోస్టుమార్టం చేసినప్పుడు శరీర భాగాలను బయటకు తీసి తూకం వేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో స్త్రీ గర్భాశయాన్ని తీసివేసి ఆమె బరువును కూడా కొలుస్తారని చెబుతున్నారు. మరి అలా ఎందుకు చేస్తారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోరెన్సిక్ విభాగంలోని వైద్యులు మట్లాడుతూ పోస్టుమార్టం సమయంలో అవయవాలను తీసివేసి తూకం వేసి తర్వాత శరీరంలో ఉంచి సీలు వేస్తారని వివరించారు. ఏదైనా అవయవం బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, అది శరీరంలో ఏదో సమస్య ఉందని సూచిస్తుందని తెలిపారు. దీని ఆధారంగా పోస్టుమార్టం నివేదిక తయారు చేస్తారని తెలిపారు. అవయవాలను తూకం వేయడం వల్ల మరణించిన వ్యక్తి పోస్ట్‌మార్టం, వైద్య నివేదికను సరిగ్గా తయారు చేయడంలో సహాయపడుతుంది.
పోస్ట్ మార్టం అంటే ఏమిటి ?
ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు లేదా మరేదైనా కారణాల వల్ల అకాల మరణానికి గురైనప్పుడు, ఆ వ్యక్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు. ఇది మరణానికి గల కారణాల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.