ఉదయం లేచిన వెంటనే కళ్లను కడుగుతున్నారా?

by Disha Web Desk 8 |
ఉదయం లేచిన వెంటనే కళ్లను కడుగుతున్నారా?
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచిన వెంటనే చాలా మంది తమకు తెలియకుండానే కళ్లు కడుగుతుంటారు. అయితే ఇలా కళ్లను కడగడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.ముఖ్యంగా కళ్ళు లేకపోతే మనం ఈ లోకాన్నే చూడలేము అందువలన కళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఉదయం లేచిన వెంటనే కొంత మంది నిద్ర రాకుండా ఉండటానికి కళ్లమీద నీళ్లను చల్లుకొని, కంటిని శుభ్రం చేసుకుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. దీని వలన కంటి దురద లేదా కళ్లు పొడిబారడం లాంటివి జరుగుతాయంట.

కళ్లలో తగినంత నీళ్లు ఉంటాయి. దుమ్ము లేదా ధూళిని శుభ్రం చేయడానికి కంటిలో నీరు సరిపోతుంది. కానీ మీరు తరచూ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వలన నీళ్లలోని దుమ్ము కళ్లలోకి చేరి, కార్నియా, కండ్లకలక వంటి సమస్యలు రావచ్చు. నీటిలోని బ్యాక్టీరియా వలన కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి.నీటిలో ఉండే బ్యాక్టీరియా, మలినాలు మీ కళ్ళ లోకి ప్రవేశించి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని వలన ఇన్ఫెక్షన్, చికాకు కలిగే అవకాశం ఉంది. అదే విధంగా కంటిలో నీరు ఎక్కువగా ఉంటే అది మీ దృష్టిపై ఎఫెక్ట్ చూపెట్టవచ్చు. అందు వలన కళ్లలో నీరు పోయకుండా, శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి కళ్లను శుభ్రం చేసుకోవాలంట. దీంతో రాత్రిపూట కళ్ల చుట్టూ ఉన్న మురికి పోవడమే కాకుండా, కళ్లు కూడా శుభ్రపడతాయి. కళ్లకు ఎలాంటి హాని ఉండదు.



Next Story

Most Viewed