- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Long Journey: లాంగ్ జర్నీ ఇష్టమా..?. మీరు ఎక్కాల్సిన ఏకైక రైలు ఇదే..!
దిశ, ఫీచర్స్ : కొందరికి జర్నీ అంటే పడదు.. బస్సులో, ట్రైన్‌లో, కారులో ఇలా ఏ వాహనంలో ఎక్కడికి వెళ్లినా సిక్ అవుతుంటారు. తలనొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతుంటారు. ఇంకొందరికైతే ప్రయాణమంటే మహా సరదా.. లాంగ్ జర్నీ చేయాలని, పర్యాటక ప్రాంతాలను, కొత్త ప్రదేశాలను చుట్టి రావాలని ఉత్సాహం చూపుతుంటారు. అయితే ఇలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఏకంగా 13 రాష్ట్రాలను దాటుతూ వెళ్లే ట్రైన్ మన దేశంలో నడుస్తోంది.
భారతీయ రైల్వేకు మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు దేశంలో మొత్తం 28 రాష్ట్రాలను కలుపుతూ అనేక రైళ్లను నడుపుతున్నారు. ప్రజలు కూడా వీటిలో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే సుదీర్ఘ ప్రయాణాలు చేయాలని, కొత్త ప్రదేశాలను చూడాలని భావించే వారికోసం కూడా అనేక ట్రైన్లు అందుబాటులో ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో ఏకంగా 13 రాష్ట్రాల గుండా ప్రయాణించే నవయుగ్ ఎక్స్‌ప్రెస్ ఒకటి.
ఇండియన్ రైల్వే నవయుగ్ ఎక్స్‌ప్రెస్‌ను కర్ణాటక రాష్ట్రం, మంగుళూరు నుంచి జమ్ము తావి వరకు నడుపుతోంది. జర్నీలో భాగంగా ఇది కేరళ, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కశ్మీర్ చేరుకుంటుందని రైల్వే నిపుణులు చెప్తున్నారు. మొత్తం నాలుగు రోజులపాటు ప్రయాణిస్తూ.. 13 రాష్ట్రాలను దాటడానికి ఈ రైలుకు 68 గంటల 20 నిమిషాల సమయం పడుతుందట. ఇకపోతే నవయుగ్ ఎక్స్‌ప్రెస్‌కు 12 రాష్ట్రాల్లో స్టాపులు ఉండగా.. ఒక్క హిమాచల్ ప్రదేశ్ మాత్రమే నాన్‌స్టాప్ ఏరియా. ఏది ఏమైనా లాంగ్ జర్నీ ఇష్టపడేవారికి ఇదొక చక్కటి అవవకాశం అంటున్నారు నిపుణులు.