తిరుపతిలో వెంకటేశ్వరస్వామి కళ్ళు మూసుకొని ఉంటారు.. ఎందుకో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-04-25 11:23:58.0  )
తిరుపతిలో వెంకటేశ్వరస్వామి కళ్ళు మూసుకొని ఉంటారు.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దర్శనానికి లక్షలాది మంది తరలి వస్తుంటారు. అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని, ఏదైనా కోరిక కోరుకున్నా తర్వగా నెరవేరుతుంది అంటారు కొందరు భక్తులు.

ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని చూడటానికి రెండు కళ్లు చాలవు. అయితే ఆయన సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా గమనిస్తే ఆయన కళ్లు ఎప్పుడూ మూసే ఉంటాయి. అంతే కాకుండా ఆయన కళ్లకు అప్పుడప్పుడు తెల్లని గుడ్డను కడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వెంకటేశ్వర స్వామి వారి కళ్లు ఎందుకు మూసి ఉంటాయని, దీనికి ఓ రీజన్ ఉంది.ఆయన కళ్లు విశ్వశక్తికి మించినవంట, అందుకే స్వామి కళ్లలోకి భక్తులు నేరుగా చూడలేరని చెబుతారు పండితులు. కానీ ప్రతి గురువారం ఆయన కళ్లకు ఉన్న ముసుగును మారుస్తారంట, అప్పుడు మాత్రమే స్వామి కళ్లను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed