చనిపోయిన వారి ఊరేగింపులో డబ్బులు ఎందుకు చల్లుతారో తెలుసా?

by samatah |
చనిపోయిన వారి ఊరేగింపులో డబ్బులు ఎందుకు చల్లుతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా చనిపోతే, శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లే క్రమం నుంచి దహనం చేసే వరకు ఎన్నో ఆచారాలు పాటిస్తుంటారు. అయితే ఇంటి నుంచి శవాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లే క్రమంలో శవం మీద డబ్బులు చల్లుతుంటారు. అంత్యక్రియలు చేసే సమయంలో మరమరాలలో చిల్లర నాణాలను మరమరాలలో వేసి దారంతా చల్లుతారు. అలాగే నోట్లను కూడా రోడ్లపై డబ్బులు వేస్తుంటారు. అయితే ఎందుకు చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు పడేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారట. చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది ఎన్నో ఏళ్లగా చూస్తూనే ఉన్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుందట.

Advertisement

Next Story

Most Viewed