వాచ్ ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

by samatah |
వాచ్ ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వాచ్ చేతికి పెట్టుకోవడం చాలా మంచి అలవాటు అంటుంటారు. మనం ఏ పని చేసినా టైమ్ చూసుకుంటూ ఇన్ టైమ్‌లో వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. గతంతో పోలీస్తే ఇప్పుడు వాచ్ పెట్టుకునే వారు చాలా తక్కువయ్యారనే చెప్పవచ్చు. సెల్ ఫొన్ వచ్చినప్పటి నుంచి వాచ్ అనేదే మర్చిపోయారు. విద్యార్థులు పరీక్ష టైంలో, కొంత మంది ఉద్యోగులు తప్పితే ఎవరూ వాచ్ అనేది పెట్టుకోవడం లేదు.

అయితే వాచ్ పెట్టుకునే వారు ఎక్కువగా ఎడమ చేతికే పెట్టుకుంటారు. అయితే చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది. వాచ్ ఎడమ చేతికే ఎందుకు పెట్టుకోవాలి అని. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ మంది కుడి చేతులతోనే పని చేసుకుంటారు అంటే కుడి చేతి వాటం కలవారు ఎక్కువమంది ఉంటారు. కుడి చేత్తో రాయడం, టైపింగ్ చేయడం, లేదంటే ఏదైనా పని చేసినా కూడా ఎడమ చేతికి వాచి ఉండడంతో ఈజీగా మనం ఎంత పనిలో ఉన్నా కూడా టైం ఎంత అయ్యింది అనేది చూసుకోవచ్చు, టైం చూడడానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ కుడి చేతికి పెట్టుకుంటే పనిలో ఉన్నప్పుడు టైం చూసుకోవడానికి అస్సలు వీలుపడదు. అందువలన ఎడమ చేతికే వాచ్ పెట్టుకోవాలంటారు, పెట్టుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed