- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మహాశివరాత్రి రోజున చిలగడదుంపలను ఎందుకు తింటారో తెలుసా?
దిశ, ఫీచర్స్: ‘‘శివుని పట్ల తమకున్న భక్తి, ఆరాధనను తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు. పిల్లలు, రోగులు, వృద్ధులు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. అయినా కూడా కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. అంటే మహా శివరాత్రి నాడు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు’’.
అయితే కొంతమంది శివరాత్రి నాడు ఉపవాసం ఉండి.. అన్నం తినకుండా స్నాక్స్ గా పలు ఐటెమ్స్ తింటుంటారు. ముఖ్యంగా చాలా మంది శివరాత్రి రోజు ఎక్కువగా చిలగడదుంపలను తీసుకుంటారు. ఈ పండుగ రోజే చిలగడదుంపలకు ఎక్కువగా ఎందుకు ప్రధాన్యతనిస్తారు. ఎందుకు తింటారో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు స్వీట్ పొటాటోలను సాధారణంగా తీసుకుంటుంటారు. అందులో చిలగడదుంప ఒకటి. చిలకగడదుంపలో ఎన్నో శక్తివంతమైన పోషకాలుంటాయి. స్వీట్ గా ఉండటంతో పాటు పొటాషియం, ఐరన్ మెగ్నీషియం, విటమిన్ డి, సి వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. చవకైనవి అండ్ రుచికరమైన చిలగడదుంపలను శివరాత్రి నాడు మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముతుంటారు. ఎక్కువమంది వీటిని శివరాత్రి పండుగ ముందు రోజే కొనుక్కుని పెట్టుకుంటారు.
పండగ నాడు ఉపవాసం సమయంలో వీటిని తక్కువ వాటర్‌లో ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి.. శివుడి వద్ద పెట్టి.. కాసేపయ్యాక తింటారు. చిలగడదుంపలు తింటే కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుంది. అలాగే ఇవి ఎక్కువ సమయం పాటు ఎనర్జీగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యానికి కూడా చిలగడదుంపలు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతాయి. కాగా మహాశివరాత్రి నాడు చాలా మంది చిలగడదుంపలను ఎక్కువగా తీసుకుంటారు.