- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలికను గర్భవతిని చేసి...ఆపై అబార్షన్ చేయించి...
దిశ, వేములవాడ : మైనర్ బాలికను పెళ్లి చేసుకొని ఆపై గర్భవతిని చేసిన వ్యక్తిపై, గర్భాన్ని నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన ఆసుపత్రి పై వేములవాడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల సమీపంలోని పెద్దూర్ కు చెందిన ఓ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకొని బలవంతంగా ఆమెను శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిన తరువాత రక్త స్రావం జరగగా సిరిసిల్లలోని అమ్మ హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు సదరు బాలికను పరీక్షించి మైనరు అని తెలిసినప్పటికీ అబార్షన్ చేశారు.
ఈ ఉదంతం జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ విషయాన్ని సంబంధించిన అధికారులకు తెలపకుండా నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినందుకు బాలిక ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీసులు సదరు వ్యక్తి పై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కి తరలించారు. అలాగే చట్టానికి విరుద్ధంగా అబార్షన్ చేసిన సిరిసిల్ల పట్టణంలోని అమ్మ హాస్పిటల్ పై కూడా పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.