నవ వధూవరులతో సత్య నారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-04-08 08:55:07.0  )
నవ వధూవరులతో సత్య నారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా ప్రజలు చేసే పూజలో ముఖ్యమైనది సత్యనారాయణ వ్రతం ఒకటి. గృహ ప్రవేశం తర్వాత లేదా ఏదైనా ముఖ్యమైన రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఎక్కువగా పెళ్లి జరిగిన ఇంట్లో నవ వధూవరులతో సత్యనారాయణ వ్రతం తప్పకుండా జరిపిస్తారు. పెల్లి తర్వాత కొత్త కోడలిని అత్తగారింటికి తీసుకెళ్లి కొడుకు, కోడలితో ఈ వ్రతాన్ని నిష్ణగా చేస్తారు. అయితే ఈ వ్రతం చేయడానికి గల ముఖ్యమైన కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

వివాహం తర్వాత నూతన వధూవరులకు ఇబ్బందులు రాకుండా ఆనందంగా ఉండాలని సత్యనారాయణ వ్రతం చేస్తారు. అలాగే ఈ వ్రతం చేయడం వల్ల వారి జీవితంలో ఎలాంటి సమస్యలు, కలహాలు రావని పెద్దలు నమ్ముతారు. సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తే అన్ని శుభాలు కలుగుతాయని హిందువుల నమ్మకం. నవ వధూవరుల జీవితం బాగుండాలని ఈ వ్రతాన్ని జరిపిస్తారట.

ఇవి కూడా చదవండి: హెల్తీ లైఫ్ స్టైల్‌.. ఏం చేస్తే సాధ్యమో తెలుసా?

Advertisement

Next Story