- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేసీబీని చూశారా.. అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : జేసీబీని అందరు చూసే ఉంటారు. ఇది చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇక చిన్ని పిల్లలకు ఈ వాహనం అంటే చాలా ఇష్టం. అందుకే వారు జేసీబీ వాహనం బొమ్మలు కొనుగోలు చేసి ఆడుకుంటూ ఉంటారు.
ఇక పెద్ద పెద్ద భవనాలు కూల్చేందుకు జేసీబీని ఉపయోగిస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? దీని రంగు పసుపు కలర్‌లో మాత్రమే ఉంటుంది.మరి జేసీబీ రంగు పసుపు కలర్‌లో మాత్రమే ఎందుకు ఉంటుంది. గ్రీన్, రెడ్ కలర్‌లో ఉండొచ్చుగా? అనుకుంటున్నారా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
జేసీబీని 1953లో బ్యాక్‌కాక్‌లో తయారు చేశారంట. అప్పుడు దీనికి నీలం, ఎరుపు , తెలుపు రంగులు వేశారంట. కానీ అవి రాత్రి సమయంలో అంతగా కనిపించక పోవడంతో, భద్రతా దృష్ట్యా దాన్ని పసుపు రంగులోకి మార్చారంట.నిర్మాణ ప్రదేశాల్లో ఎరుపు , తెలుపు జేసీబీ యంత్రాలు పనిచేసినప్పుడు.. దూరం నుండి కనిపించడంలో ఇబ్బంది ఏర్పడటంతో కంపెనీ యజమానులు రంగు మార్చడంపై నిర్ణయం తీసుకున్నారంట. వాటికి పసుపు రంగును వేశారంట. దీంతో అవి ఎంత దూరంలో ఉన్నా కనిపించడమే కాకుండా, రంగు మారిన తర్వాత వాటికి ఫుల్ డిమాండ్ వచ్చిందంట.అలా అప్పటి నుంచి జేసీబీలు పసుపు రంగులో మాత్రమే ఉంటున్నాయి.నోట్ ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.