- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనుమంతుడు ఒంటి నిండా సింధూరాన్ని ఎందుకు ధరిస్తాడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : హనుమాన్ భక్తులు చాలా మంది ఉంటారు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా భక్తుల కష్టాలు, భయాలన్నీ తొలిగిపోతాయంటారు. అయితే ఎక్కడ హనుమంతుడిని చూసినా ఒంటి నిండా సింధూరంతో దర్శనిమిస్తాడు.
అంతే కాకుండా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించి, సింధూరం సమర్పిస్తే ఆయన చాలా సంతోషించి, కోరిన కోర్కెలు తీరుస్తాడంట.అయితే అసలు హనుమంతుడికి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది. దీనికి సంబంధించి ఓ పౌరాణిక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకసారి మాత సీత తన నుదుటిపై సింధూరాన్ని పెట్టుకుంటుండగా హనుమంతుడు "అమ్మా, నీ నుదిటిపై ఎందుకు సింధూరాన్ని పూస్తావు? అని ఆసక్తిగా అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా, తల్లి సీత తన ప్రభువు, తన భర్త శ్రీరాముడు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం ఇలా సింధూరాన్ని ధరిస్తానని చెప్పింది. హిందూ మత గ్రంధాలలో, పురాతన కాలం నుండి, వివాహిత స్త్రీలు సింధూరాన్ని పూస్తున్నారు. ఇది భర్త జీవితాన్ని పొడిగిస్తుంది. ఇది విన్న హనుమంతుడు తన ఆరాధ్యుడైన శ్రీరాముడి దీర్ఘాయువును కోరుకున్నాడు. కోరిక తీర్చడం ద్వారా అతని ఆయుష్షు పొడిగించబడితే, నేను నా శరీరమంతా సింధూరాన్ని ధరిస్తానని , ఇది నా స్వామిని అమరుడిని చేస్తుందని అప్పటి నుంచి సింధూరాన్ని ధరించడం ప్రారంభించాడు.
Read more: