- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న పిల్లలకు పుట్టెంటుకలు ఎందుకు తీస్తారో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: సాదారణంగా హీందు సాంప్రదాయంలో బాగంగా చిన్న పిల్లలకు సంవత్సరం తర్వాత పుట్టు వెంట్రుకలు(కేశ కండన) తీస్తారు. అయితే ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అయినప్పటికి చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీయడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. 9 నెలల పాటు పిల్లలు తల్లి గర్భంలో ఉన్న ఉమ్మీ నీటిలోనే పెరుగుతారు. దీంతో ఉమ్మీ నీటిలో ఉన్న బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు పిల్లలలోని శరీరంలో, తల భాగంలో ఉండి బయటకు వస్తాయి. అయితే కొద్ది రోజులకు శరీరంపై ఉన్న చర్మం పోయి సూక్ష్మక్రిములు పోతున్నప్పటికీ.. తల భాగంలో మాత్రం అలా జరగదు. ఎంత మంచి షాంపూలు పెట్టి స్నానం చూపించినప్పటికీ బిడ్డ నెత్తిపై ఉన్న బ్యాక్టీరియా చనిపోదు.
దీంతో చిన్న పిల్లలు అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మన పూర్వీకుల నుంచి కేశ ఖండన కార్యక్రమం అనాదిగా వస్తుంది. అయితే ఇది ఎందుకు ఒక సంవత్సరం ముగిసిన తర్వాతనే చేస్తారంటే పుట్టిన బిడ్డ తల భాగం మెత్తగా ఉంటుంది. అది గట్టిపడటానికి సుమారు.. సంవత్సరం పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం తర్వాతే చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీస్తారు. పిల్లలకు గుండు చేయించడం వల్ల నెత్తిపై సూర్యరష్మి పడటంతో పిల్లల ఎదుగుదల వేగంగా ఉంటుంది. సూర్య రష్మీ కారణంగా పిల్లలో రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే.. గుండు చేయించడం వల్ల మాడు క్లీన్ అవ్వడమే కాకుండా.. పిల్లల దంతాల పెరుగుదల వేగంగా జరగడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. ఈ కారణాల చేతనే పిల్లలకు పుట్టెంటుకలు, గుండు గీయిస్తారు.
Also Read...
మిరాకిల్ క్రీమ్.. బొల్లి వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తున్న రుక్సోలిటినిబ్