కుక్కలు ఎందుకు ప్రైవేట్ పార్ట్స్ వాసన చూస్తాయో తెలుసా..?

by Kavitha |
కుక్కలు ఎందుకు ప్రైవేట్ పార్ట్స్ వాసన చూస్తాయో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కాలంలో చాలా మంది ఇళ్లలో కుక్కలు ఉంటునే ఉన్నాయి. అయితే వాటిని మనం గమనించినట్లైతే యజమానులతో గానీ, బయట తెలిసిన వాళ్లు వచ్చినప్పుడు అవి ఎక్కువగా ప్రైవేట్ పార్ట్స్ దగ్గరకు వచ్చి వాసన చూస్తూ ఉంటాయి. మరి అవి ఎందుకు అలా చేస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బేసిక్‌గా కుక్కలు ప్రైవేట్ పార్ట్స్ దగ్గరకి వచ్చి వాసన చూస్తుంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవి అలా ఎందుకు చేస్తాయి అంటే కుక్కలో ముక్కు భాగం గొప్ప గ్రహణ శక్తిని కలిగి ఉంటుంది. వాటి ముక్కు మన కంటే లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ వాసన ద్వారా అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి. ఇక ప్రైవేట్ పార్ట్స్ నుండి వెలువడే వాసన, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి.

కుక్కలు మూత్రం వాసన ద్వారా తెలుసుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు:

*కుక్కలు ఒకదానికొకటి మూత్రం వాసన చూడటం ద్వారా వాటి వయసు, లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

*అలాగే తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్రం వాసన చేస్తాయి. ఇతర కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా ఇది ఒక రకమైన సందేశం.

*కుక్కలు అపాయకరమైన జంతువులు గురించి తెలుసుకోవడానికి మూత్రం వాసనను ఉపయోగిస్తాయి.

*డాగ్స్ మన భావోద్వేగాలను కూడా వాసన ద్వారా గ్రహిస్తాయి. ఉదాహరణకు, మనం భయపడితే లేదా కోపంగా ఉంటే మన శరీరం నుండి వెలువడే వాసన మారుతుంది. దీన్ని కుక్కలు గ్రహిస్తాయి.

*ఆహారం లేదా నీరు ఉన్న చోటును కూడా డాగ్స్ వాసన ద్వారా కనుక్కుంటాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను కూడా ఇవి వాసన ద్వారా గ్రహిస్తాయి.(ఇంటెర్నెట్ ద్వారా గ్రహించినది మాత్రమే)

Next Story

Most Viewed