అరటి పండ్లు ఎందుకు వంకరగా ఉంటాయో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-03 06:41:17.0  )
అరటి పండ్లు ఎందుకు వంకరగా ఉంటాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అరటి పండ్లు అందరికీ తెలిసినవే. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే అరటి పండ్లను చూసినప్పుడు మీకు ఒక డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.. అదేమిటంటే? ఆఫిల్ ,ఆరెంజ్ వంటివి ఫ్రూట్స్ గుండ్రంగా ఉంటాయి. కానీ అరటి పండ్లు మాత్రం కాస్త వంకర తిరిగినట్టుగా ఉంటాయి. అసలు అరటి పండ్లు ఎందుకు వంకర తిరిగి ఉంటాయి. దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండ్లు ముందుగా పూలు వచ్చి, ఈ పూల అంచునుంచి అరటి పిందా రావడం మొదలవుతుంది. ఇది పెరిగి కాయగా మారుతుంది. అయితే అరటి ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. అందు వలన ఆకుల కిండ పండే పండ్లకు కరెక్ట్‌గా సూర్యర్శి అందదు, అందుకే అవి పైకి, సూర్యని వైపుకు తిరిగి పెరుగుతాయంట.

ఎందుకంటే ఏ పండ్లైనా చెట్టుకి కాసిన తరువాత వాటికీ నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అవి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షించబడతాయి. కానీ అరటి పండ్ల విషయంలో మాత్రం ఇలా జరగదంట. అవి సూర్యుడు ఎటువైపు పడుతుంటే అటు వైపుకు తిరిగి పెరుగుతుంటాయి. అందుకే అరటి పండ్లు వంకరగా ఉంటాయంట.

Read More: విపరీతమైన ఆకలి వేధిస్తోందా? .. రక్తంలో గ్లూకోజ్ పెరగడంవల్ల కావచ్చు

Advertisement

Next Story