ఎండకాలం టైర్లు పంక్చర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

by Sumithra |   ( Updated:2023-04-07 08:58:01.0  )
ఎండకాలం టైర్లు పంక్చర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవికాలం మొదలయ్యిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే చాలు ఎర్రటి ఎండను చూస్తేనే ఎండలో మాడిపోతామేమో అన్నంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ఇంతటి ఎండలో ద్విచక్రవాహనాలు, కార్లను బయట ఉంచడం, ఎర్రటి ఎండలో తారురోడ్డుపై వాహనాలను నడపడంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎండ తీవ్రతకి వాహనాల టైర్లు పంక్చర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఎండవేడికి టైర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అతి వేగంగా వాహనాలను, బ్రేకులు వేయడం వల్ల టైర్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

అందుకే ప్రయాణం చేసేటప్పుడు కానీ, వాహనాలను ఎండలో ఉంచినప్పుడు కానీ వాటి టైర్లని పదే పదే గమనిస్తూ ఉండాలి. అలాగే టైర్ ప్రెజర్‌ని చెక్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కార్ టైర్లపై జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలం ప్రయాణించేప్పుడు టైర్లలో గాలి 1-2 పాయింట్లు తక్కువగానే ఉండాలి. కార్ టైర్ కి ఎలాంటి హాని కలగకుండా ఉండాలంటే నైట్రోజన్ నింపడం వల్ల టైర్లు కూల్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రయాణం చేసేటప్పుడు 5,000-6,000 కి.మీకి ప్రయాణించగానే వెనక టైర్లని ముందుకు, ముందు టైర్లను వెనకకు అమర్చడం వలన టైర్లమీద ఓకే విధమైన బరువు పడకుండా ఉంటుందని, టైర్లు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. కారు ముందు టైర్లు వెనుక టైర్లని బరువును కలిగి ఉంటాయి. పైన తెలిపిన జాగ్రత్తలను పాటిస్తే ఎక్కువ కాలం టైర్లు మన్నికగా ఉంటాయి.

Read more :

ట్రాఫిక్‌లో ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ఈ కారు ఫ్రెష్‌నర్‌తో సొల్యూషన్

Advertisement

Next Story