- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంవత్సరానికి ఒక్కసారే ఆహారం తిని బతికే జీవి ఏంటో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : తేలు. ఈ పదం వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటి ఓ తేలును చూస్తే చిన్నా.. పెద్ద తేడా లేకుండా పరుగులు తీస్తారు. మరి కొందరు అవ్వి ఎక్కడ హాని చేస్తాయోనని చంపేస్తారు. తేళ్లల్లోనూ విషపూరితమైనవి, విషం లేనివి ఉంటాయి. అయితే ఈ తేలు లేదా వృశ్చికము అరాక్నిడా తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి. వీటిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి. తేలు ఆకారం గురించి మనందరికీ తెలిసిన విషయమే.
తేలు గురించి ఓ విచిత్రమైన నిజం ఉంది. ఆహారం లేకుండా ఏడాదిపాటు జీవిస్తాయని పరిశోధనల్లో తేలింది. అవసరమైతే ఇవి ఏడాదికి ఒక పురుగు దొరికినా చాలు దాన్ని తిని బతికేస్తాయి.. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా జీవిస్తాయి. ఒక్కోసారి తిండి దొరకకపోతే జీర్ణ ప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. అప్పుడు దీనికి ఏడాదికి ఒకసారి భోంచేస్తే చాలన్నమాట. శాస్త్రవేత్తలు వీటిని మంచులో గడ్డ కట్టించి పరీక్షించారు. మర్నాడు ఎండ తగలగానే నడవడం చూసి ఆశ్చర్యపోయారు. నేలలో బొరియలు చేసుకుని రాళ్ల కింద కూడా జీవిస్తాయి.
ఇవి కూడా చదవండి: