- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా..?
దిశ, ఫీచర్స్ : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, వారి ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు తమ తల్లులు వండిన ఆహారం కంటే, బయట కొనే జంక్ ఫుడ్‌నే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఆహారాలు తినడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. అంతే కాకుండా, ఈ అహార పదార్థాల నుంచి పోషకాలను సక్రమంగా గ్రహించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్: బీట్‌రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వినియోగం పిల్లలలో ఆకలిని కలిగిస్తుంది. పిల్లలకు బీట్‌రూట్ కూర తినిపిస్తే వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
కర్ర పెండలం: కర్ర పెండలంలో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారానికి రెండు సార్లు కర్రపెండలం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
యాలకులు: వీటిని తింటే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది. దీని వల్ల వారు సమయానికి ఆహారం తీసుకుంటారు.
కూరగాయల సూప్‌లు: పిల్లలకు సూప్ అంటే ఇష్టం. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే కూరగాయలు ఇష్టపడని పిల్లలకు సూప్‌లు అలవాటు చేయండి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Read More..
Kitchen: కిచెన్ లో ఈ పనులు చేస్తే దరిద్రమంట.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?