- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమలో పడితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : దువ్విన తలనే దువ్వడం.. అద్దిన పౌడర్ అద్దడం.. అద్దం వదలక పోవడం.. అందానికి మెరుగులు దిద్దడం.. ఈ పాటని దాదాపుగా ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ప్రేమలో పడినప్పుడు హీరోలో వచ్చే ప్రతి మార్పును ఈ పాటలో చూపించారు. నిజజీవితంలో కూడా ప్రేమలో పడిన వారు బహుశా ఇలాచే చేస్తారేమో.. కానీ కొంతమంది నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రేమలో పడిన యువతీయువకుల్లో చాలావరకు శరీరంలో కొన్ని రకాల రసాయన మార్పులు జరిగి శరీరానికి ఒక నిర్దిష్ట ఆకర్షణను ఇస్తాయట. మెదడులోని యుఫోరిక్ రసాయనాలు విడుదలై బంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుందట. ఇవ్వే కాదండి ఇంకా చాలా మార్పులు జరుగుతాయట.. మరి ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమలో పడిన వారు బలంగా తయారవుతారట. ప్రేమ కలిగినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై నొప్పిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. అంతే కాదు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ వెల్లడించిన అధ్యయనం ప్రకారం అరచేతులు చెమటలు పడి, బుగ్గలు ఎర్రగా మారి, హృదయ స్పందన రేటు పెరుగుతుందట. శరీరంలో ఉండే అడ్రినలిన్, నోర్‌పైన్‌ఫ్రైన్‌ల ఉద్దీపన వల్ల ఇలా జరుగుతుందట.
రొమ్ము ఎముక విస్తరించడం, ప్రేమికుల కళ్ళు ప్రేమతో విశాలమవుతాయట. మీ భాగస్వామిని ఆకర్షించడానికి కావలసిన ఇలాంటి పరిణామాలన్నీ నాడీ వ్యవస్థ వల్ల కలుగుతాయట. ప్రేమికుల్లో సరిగ్గా ఆకలి లేకుండా పోతుంది. నిజమైన ప్రేమలో పడినప్పుడు కడుపులోని రక్తనాళాలు కుంచించుకుపోయి కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. దీంతో వారిలో ఆకలి సరిగ్గా ఉండదట. వారి భాగస్వామితో సమయం గడిపినప్పుడు అది కొద్ది కొద్దిగా పోతుందట. తన భాగస్వామికి దూరంగా ఉన్నప్పుడు కార్టికోట్రోపిన్ అనే హార్మోన్ విడుదలై ఆందోళనకు, నిరాశకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
2010లో రట్జర్స్ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రేమలో ఉన్నప్పుడు వారి మెదడులో వాసోప్రెస్సిన్, అడ్రినలిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయట. వివిధ గురుత్వాకర్షణ పాయింట్ల వద్ద విడుదలైన రసాయనాలే తమ పార్ట్నర్ తో బంధాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయట.