- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్బోహైడ్రేట్లు తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం పై శ్రద్ధ పెట్టాలి. మన శరీరానికి తగిన మోతాదులో పోషకాలు అందకపోతే, మనం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఐరన్ తో సహా అన్ని పోషకాలు శరీరానికి అవసరం. కానీ ఇవి కాకుండా, కార్బోహైడ్రేట్ కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి శక్తిని అందించేలా పనిచేస్తుంది.
మధుమేహం లేదా బరువు పెరుగే సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లను చేర్చుకోరు. కానీ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
శక్తి కోసం అవసరం..
శరీరానికి కార్బోహైడ్రేట్లు లభించనప్పుడు అది ఇతర పోషకాల పై ఆధారపడవలసి ఉంటుంది. కార్బోహైడ్రేట్ల కొరతతో బలహీనత, బద్ధకం వంటి సమస్యలను తలెత్తుతాయి. కార్బోహైడ్రేట్ల కొరత మీ శరీరంలో ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల కార్బోహైడ్రేట్లను నియంత్రిత పరిమాణంలో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎంత కార్బోహైడ్రేట్ తినాలి..
ఆరోగ్య నిపుణులు రోజుకు 2000 కేలరీలు తీసుకోవాలని చెబుతున్నారు. మీ ఆహారంలో తప్పనిసరిగా 225-325 గ్రాముల పిండి పదార్థాలు ఉండాలని చెబుతున్నారు. మానవ శరీరంలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటే అలసట, నీరసం సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.
మలబద్ధకం సమస్య
జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే పీచుపదార్థాలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం మానేస్తే అది శరీరంలో లోపం కలుగుతుంది. దీని వల్ల మీకు మలబద్ధకం సమస్య రావచ్చు. బంగాళదుంపలు, తృణధాన్యాలు, పాస్తా వంటి వాటిని మీ ఆహారంలో తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అయితే డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ తినాలి.
- Tags
- carbohydrates