చాక్లెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు తెలుసా?

by Jakkula Samataha |
చాక్లెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చాక్లెట్ పేరు వినగానే అందరికీ నోరూరిపోతుంటది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే చాక్లెట్స్ పంచడం చేస్తుంటారు. అలాగే కొంత మంది టైమ్ పాస్‌కి చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటుంటారు.ఇక అమ్మాయిలు, చిన్న పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.అయితే లవర్స్ తమ ప్రియురాలిని కూల్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా చాక్లెట్స్ ఇస్తుంటారు.

అలాగే చిన్న పిల్లలు చాక్లెట్స్ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక వీరు ఎక్కువగా అల్లరి చేసినా, స్కూల్‌కు వెళ్లను అని మారం చేసినా, తల్లిదండ్రులు చాక్లెట్స్ కొనిస్తుంటారు. ఇది ఎంతో తియ్యగా, టెస్టీగా ఉండటంతో చాలా మంది వీటిని తినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఏంటీ చాక్లెట్ గురించి ఎక్కువ తీస్తుంది అనుకుంటున్నారా? మీరు లొట్టలు వేసుకుంటూ తినే చాక్లెట్ గురించి మీకు ఈ విషయం తెలుసా? చాక్లేట్ తియ్యాగా కాకుండా చేదుగా ఉండేదంట?అయితే దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

చాక్లెట్ ఇప్పుడంటే తీయ్యగా మారిపోయింది కానీ, ఒకప్పుడు ఇది చాలా చేదుగా ఉండేదంట. ఆరోగ్యం కోసం పూర్వం గిరిజనులు చాక్లెట్లు తయారు చేసే కోకో గింజలతో చేదు పానీయాన్ని కాచుకుని తాగేవారంట. దక్షిణ అమెరికాలో ఎన్నో వందల ఏళ్ల క్రితం మాయ, ఆజ్‌తెక్ తెగవారు నివసించే వారు. వారే కోకో బీన్స్ ని తొలిగా ఉపయోగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చాక్లెట్ తయారయ్యే కోకో బీన్స్ 3000 ఏళ్ల కిందటి నుంచి వాడుకలో ఉన్నట్టు తెలుస్తోంది.

మాయ, ఆజ్ తెక్ తెగ వారు ఆరోగ్యం బాగుంటుందని ఈ కోకో గింజలను పానీయంలా కాచుకుని తాగే వారు. ఐర్లాండు దేశానికి చెందిన ఒక వ్యక్తి చేదుగా ఉండే కోకో పానీయాన్ని తాగలేక పాలల్లో ఈ కోకో బీన్స్ పొడిని వేశాడు. అది చాలా టేస్టీగా ఉండడంతో.. అందరూ అలా తాగడం మొదలు పెట్టారు. ఆ తరువాత పాలు, కోకో పొడి కలిపి చాక్లెట్లు ఘనరూపంలో తయారుచేయడం ప్రారంభించారు. అలా చాక్లెట్ తియ్యాగా మారి మన నోరును తీపి చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed