ప్రతిరోజూ చికెన్ తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

by Jakkula Samataha |
ప్రతిరోజూ చికెన్ తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. నాన్ వెజ్‌లో చికెన్ అంటేనే ఎక్కువ మందికి ఇష్టం ఉంటుంది. దీంతో చికెన్ ఫ్రై, లెగ్ పీస్ ఫ్రై, చికెన్ కర్రీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని ప్రతి రోజు తింటుంటారు. మరీ ముఖ్యంగా యూత్, రూమ్స్‌లో ఉంటూ.. ప్రతి రోజు చికెన్ వండుకుని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా, ప్రతి రోజూ తినడం మాత్రం ప్రమాదం అంటున్నారు వైద్యులు. రోజూ చికెన్ తినడం వలన శరీరంలో సోడియం పెరుగుతుందంట. ఇది అధిక రక్తపోటు లాంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే చికెన్‌లో ఒక రసాయనం ఉంటుంది, ఇది పెద్దపేగు క్యాన్సర్‌కు కారణమవుతుందంట. అందువలన ప్రతి రోజు చికెన్ తినకూడదంట.ఒక వేల చికెన్ అంటే అతిగా ఇష్టం ఉంటే, ప్రతి రోజూ 50 గ్రాముల వరకు తినవచ్చునంట. దానికి మించి అతిగా అస్సలే తినకూడదంట.

Advertisement

Next Story

Most Viewed