అనవసరంగా పోలీసులు మనల్ని కొట్టినా, తిట్టినా అది నేరమే తెలుసా

by Sridhar Babu |   ( Updated:2023-06-23 11:43:19.0  )
అనవసరంగా పోలీసులు మనల్ని కొట్టినా, తిట్టినా అది నేరమే తెలుసా
X

దిశ, వెబ్​డెస్క్​ : సమాజంలో పోలీసుల తీరు మనకి తెలుసు. అనవసరమైన దానికి కూడా కస్సుబుస్సులాడటం వారికి అలవాటు. ఇక పల్లెల్లో వారు ఉపయోగించే పదజాలం మరీ దారుణంగా ఉంటుంది. ఏదేనా పొలిటికల్​ మీటింగులు, పండుగల సమయంలో వీరు తమ ప్రతాపం చూపిస్తుంటారు. అలాంటప్పుడు మనం వారు తిట్టినా, కొట్టినా పట్టించుకోము.

కానీ నిజానికి వారికి ఆ అధికారం లేదు. మనం తప్పు చేయకున్నా తిట్టడం కానీ, కొట్టడం కానీ చేస్తే అది నేరం అవుతుంది. చట్టం మనవైపే ఉంటుంది. ఈ విషయం మనలో 90 శాతం మందికి తెలియదు. ఒక పోలీసులు అధికారి మనం ఎలాంటి తప్పు చేయకున్నా తిట్టినా, కొట్టినా వారిపై కేసు నమోదు చేయొచ్చు. మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. ఇండియన్​ పీనల్​ కోడ్​ 166, 166 ఏ ప్రకారం అలాంటి వారిపై కేసు నమోదు చేస్తారు. కనిష్టంగా వీరికి సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్​ ఆగిపోతుంది.

ఎలా ప్రొసీడ్​ కావాలంటే...

పోలీసులు మనం తప్పు చేయకున్నా తిట్టడం కానీ, కొట్టడం కానీ చేస్తే మొదట సమీప స్టేషన్​కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. అయినా వారు స్పందించకుంటే అంటే కేసు నమోదు చేయకపోతే వెంటనే మనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ వీడియో తీసి సోషల్​ మీడియాలో ప్రచారం చేయాలి. చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. అయినా పట్టించుకోకపోతే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలి. అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు. తెలిసిందిగా ఇకపై నోటికివచ్చినట్టు ఒర్లే పోలీసులను ఈ చట్టాలు వివరించి నోరుమూయిద్దాం.

Read More... సరసాలతో ఒంటరితనం దూరం.. ఇద్దరికీ స్పెషల్‌గానే ఉంటుందట..

Advertisement

Next Story

Most Viewed