Toothbrush: టూత్ బ్రష్‌ను ఎన్ని నెలలకొకసారి మార్చాలో తెలుసా?

by Prasanna |
Toothbrush: టూత్ బ్రష్‌ను ఎన్ని నెలలకొకసారి మార్చాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మనం రోజూ ఉదయం లేవగానే బ్రష్‌ చేసి టిఫిన్ చేస్తుంటాము. దంతాలను శుభ్ర పరిచేందుకు బ్రష్ చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం టూత్ బ్రష్‌ను మార్చకుండా నెలల పాటు అదే వాడుతారు. ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్ ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకటే టూత్ బ్రష్‌ను వాడటం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

1. పాత కాలంలో కొందరు వేప పుల్లతో దంతాలను శుభ్రపరచుకునే వారు. అలాంటి వారు ఇప్పటికి ఆరోగ్యంగానే ఉన్నారు. టూత్ బ్రష్ సహాయంతో పళ్లను క్లీన్ చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. కొందరు 4,5 నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మారుస్తారు. కానీ ఒకటి, రెండు నెలలకు మంచి వాడకూడదు.

2. వాడిన బ్రష్ ఎక్కువ కాలం వాడితే బ్యాక్టీరియా పేరుకుపోయి కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

3. ఒకటే టూత్‌బ్రష్‌ని నెలలు తరబడి ఉపయోగించడం వల్ల బ్రిస్టల్స్ పాడైపోయి దంతాలు రక్తస్రావం అవుతుంది. అంతే కాదు, దీనివల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. చిగుళ్ళు సమస్య వస్తుంది. కాబట్టి దానిని 2 నెలలకైనా మార్చాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed