వాము ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

by Sumithra |
వాము ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్ : వంటింట్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. అందులో ఒకటే వాము. ఈ వాము తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వాము ఆకులను తిన్నా అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులను తినడం వలన రక్తహీనత దూరమవుతుంది. వాము ఆకుల్లో ఉండే విటమిన్స్, కాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, వంటి ఖనిజాలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అలాగే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనత దూరం..

బయట ఫుడ్‌కు అలవాటు పడి సరైన పౌష్టికాహారం తీసుకోని వారు ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వాము ఆకులను నేరుగా తిన్నా లేదా జ్యూస్ చేసుకుని తాగినా శరీరంలో ఐరన్ శాతం పెరిగి రక్తహీనత దూరమవుతుందట.

నెలసరి నొప్పి నుంచి విముక్తి..

చాలా మంది మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి బాధను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు వాము ఆకులను తినడం వలన నెలసరి నొప్పి నుంచి రిలీఫ్ అవుతారట.

నోటి దుర్వాసనకు చెక్..

కొంత మంది మాట్లాడేటప్పుడు నోటి నుంచి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాంటి వారు వాము ఆకుల్ని తినడం వలన నోటి దుర్వాసన పోతుంది. వాము ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దుర్వాసనను పోగొడతాయి. అంతేకాదు నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా ఈ ఆకులు పోగొడతాయి.

కిడ్నీ రాళ్ళు..

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వాము ఆకులని తినడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. ఆకులను తినడం ద్వారా శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే శరీరానికి కావలసిన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతుంది. ఈ ఆకులని తేనె, వెనిగర్‌తో కలిపి తీసుకోవచ్చు.

బరువు తగ్గడం..

అధిక బరువుతో బాధపడేవారు వాము ఆకుల్ని తింటే ఇవి బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. ఈ ఆకుల్లో ఉండే కేలరీలు, ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయ పడతాయి. అంతే కాదు ఈ ఆకులని నమిలి తినడం ద్వారా ఆకలి కంట్రోల్ అవ్వడమే కాదు కడుపు నిండినట్టు అనిపిస్తుందట.

కఫం దూరం..

సీజన్ మారిందంటే చాలు జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటాం. అలాంటి సమయంలో వాము ఆకులని నమిలి తినడం జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణ సమస్యలు..

ఈ మధ్య కాలంలో చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు వాము ఆకులని తినడం వలన జీర్ణ సమస్యలు దూరమవుతాయట. ఈ ఆకుల్లో ఉండే యాంటీ యాసిడ్ గుణాలు కడుపు నుండి అదనపు ఆమ్లాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా అసిడిటీ, గుండెల్లో మంట వంటివి రాకుండా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed