గోరింటాకుతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..

by sudharani |   ( Updated:2023-07-15 15:09:41.0  )
గోరింటాకుతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగింటి ఆడపడుచులకు ఇష్టమైన వాటిలో గోరింటాకు ఒకటి. పండుగలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు ఇలా సందర్భం ఏదైనా గోరింటాకుకు పూర్వంలో చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే.. మారుతున్న కాలంతో పాటు.. టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి గోరింటాకు బదులు ఇన్‌స్టెంట్ మెహందీలు వచ్చేసాయి. అవి ఎర్రగా పండేందుకు వాటిలో కెమికల్స్ లాంటివి ఉపయోగించడంతో.. చర్మ వ్యాధులు సైతం వెంటాడుతున్నాయి. అయితే.. గోరింటాకు మాత్రం ప్రకృతి పరంగా వచ్చిన ఓ జౌషదం. దీంతో చేతులు ఎర్రగా పండటమే కాదు.. అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే..

* గోరింటాకు ప్రకృతి పరంగా లభించింది కాబట్టి చేతులకు పెట్టుకుంటే అందంతో పాటు.. చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

* ఏదైనా గాయాలు అయినప్పుడు గోరింటాకు, సబ్బు కలిపి ముద్దగా చేసి వాటిపై పెడితే తొందరగా గాయాలు మాడిపోతాయి.

* ముఖ్యంగా మన శరీరానికి చాలా చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అరికాళ్లకు గోరింటాకు పెట్టినట్లయితే వేడి తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

* చర్మంపై గడ్డలు వచ్చినప్పుడు కూడా ఈ గోరింటాకు ముద్దను వాటిపై ఉపయోగించినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి :

మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఈ ఐదు విత్తనాలతో బరువు తగ్గడం ఖాయం.. నిపుణులు తెలిపేది ఇదే

Advertisement

Next Story

Most Viewed