- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లిజరిన్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో యువతీయువకులు చాలావరకు అందానికి, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ఫీట్లు చేస్తున్నారు. చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవడానికి చాలా రకాల కాస్మొటిక్స్ వాడతారు. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండేందుకు చర్మానికి తేమను అందించే ప్రొడక్ట్స్ ను వాడతారు. ఎక్కువగా కెమికలైజ్డ్ కాస్మోటిక్స్ ని వాడటం వలన చర్మం త్వరగా డ్యామెజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా చర్మసంరక్షణలో గ్లిజరిన్ చేర్చుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని పొడిబారడం నుంచి రక్షిస్తుంది. గ్లిజరిన్ వాడకం ద్వారా ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజు గ్లిజరిన్‌ను వినియోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖం పై ఉన్న నల్లటి మచ్చలను, డార్క్ స్పాట్స్‌ను పోగొడుతుంది. చర్మ సంబంధిత అంటువ్యాధులను కూడా ఇది నిరోధిస్తుంది. శరీరం పై గ్లిసరిన్ తో మసాజ్ చేస్తే మంచి పోషణను అందించి ఆరోగ్యకరమైన చర్మాన్నిస్తుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇది సహజంగా తేమను లాక్ చేస్తుంది. గ్లిసరిన్ చర్మ రంధ్రాలను మూసుకు పోనీయకుండా చేసి జిడ్డుతో వచ్చే మొటిమలను నిరోధిస్తుంది. తరచూ గ్లిసరిన్ ను చర్మం పై అప్లై చేస్తే ముడతలు కూడా రాకుండా చేస్తుంది.
గ్లిజరిన్‌ను ఎలా ఉపయోగించాలంటే..
గ్లిసరిన్ ను నీరు లేదా సరైన ద్రవంతో ముందుగా డైల్యూట్ చేయాలి. పొడిగా ఉండే ప్రాంతాల పై, ముఖం, చేతులకు అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకొని, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.