భార్య భర్తలకు అలర్ట్.. మీ ప్రైవేట్ లైఫ్ గురించి ఇతరులతో పంచుకుంటున్నారా?

by Disha Web Desk 8 |
భార్య భర్తలకు అలర్ట్.. మీ ప్రైవేట్ లైఫ్ గురించి ఇతరులతో పంచుకుంటున్నారా?
X

దిశ, ఫీచర్స్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు ఒకటిగా కలిసి జీవిస్తుంటారు. వీరు తమ వైవాహిక జీవితంలో ప్రతి విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం తమ ప్రైవేట్ లైఫ్‌ను ఇతరులతో పంచుకుంటారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వలన తమ బంధంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ బంధం అయినా సరే ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బంధం బలంగా ఉండాలంటే నమ్మకం అనేది తప్పనిసరి. ఇక ప్రతి రిలేషన్‌లో గొడవలు అనేవి సహజం.కానీ ఎన్ని గొడవలు వచ్చినా ప్రేమ, నమ్మకం అనేది బంధాన్ని కొనసాగించేలా చేస్తాయి. అయితే ఇప్పుడున్న చాలా కపుల్స్ తమ రిలేషన్ షిప్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఇలా ప్రతి దాని గురించి షేర్ చేసుకోవడం వలన కొన్ని జంటలు ప్రమాదంలో పడుతున్నాయంటున్నారు నిపుణులు. భార్య భర్తలు తమ సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచినంత కాలం వారి బంధం సేఫ్‌గా ఉన్నట్లేనంట. కానీ ఏ రోజు అయితే హద్దులు దాటి బయట ప్రపంచానికి చెప్తారో.. ముఖ్యంగా మీ ప్రైవేట్ లైఫ్ గురించి ప్రతి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటారో అప్పుడు మీ రిలేషన్ చిక్కుల్లో పడ్డట్లేనంట.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై విపరీతంగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరుల నుంచి లైక్స్ రావాలని, లేదా వారి నుంచి ప్రశంసలు పొందాలని కపుల్స్ తమని తాము చాలా బాగా చూపెట్టుకుంటున్నారు. అంతే కాకుండా కొంత మంది తమ పార్టనర్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది అస్సలే మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. సంబంధాలను గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం, ఇది సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు మీ భాగస్వామితో విషయాలను ప్రైవేట్ గా ఉంచడం వలన మీ బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి అపార్థాలు, అనుమానాలకు తావు ఉండదంట. అలాగే, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సంబంధం కోసం , వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమమని అంటున్నారు.

Next Story

Most Viewed