Health Tips: నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా.. ఇదే కారణమయ్యుండొచ్చు? నివారణలు

by Anjali |
Health Tips: నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా.. ఇదే కారణమయ్యుండొచ్చు? నివారణలు
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మందికి నిద్రలో కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం.. తద్వారా తీవ్రమైన నొప్పి కలగడం జరుగుతుంటుంది. ఈ కండరాల నొప్పిని మైయాల్జియా అని అంటారు. అయితే కొంతమందికి ఎక్కువగా కష్టపడి పని చేస్తే నిద్రలో కండరాలు పట్టేస్తాయి. మరికొంతమంది ఏం పనులు చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కండరాల నొప్పిని లైట్ తీసుకుంటే కనుక ప్రమాదంలో పడ్డట్లేనని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ సమస్యలకు కారణాలేంటో నిపుణులు చెప్పిన విషయాలు చూద్దాం..

కారణాలు-నివారణలు

ఆకుకూరలు తీసుకోవాలి..

మన శరీరంలో పోషక విలువల స్థాయి తగ్గిపోవడం వల్ల నిద్రలో కండరాల నొప్పి వస్తుంది. కాగా వారంలో నాలుగు సార్లు ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

వ్యాయామాలు చేయకపోవడం..

శరీరంలో లవణాలు తగ్గిపోవడం వల్ల, వ్యాయామాలు చేయకపోవడం వల్ల నిద్రలో కండరాలు పట్టేస్తాయి. కాగా ప్రతి రోజు ఉదయం ఎక్సర్‌సైజ్ చేయడం కండరాలు హెల్తీగా ఉంటాయి. కండరాల నొప్పి నుంచి, తిమ్మిళ్ల నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌నెస్‌గా కూడా తయారవుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాగా ప్రతిరోజు వ్యాయామం శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.

నువ్వులు తినాలి..

కాల్షియం మెండుగా ఉండే నువ్వులు తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రతి రోజు నువ్వులు తీసుకోవడం వల్ల కేవలం నిద్రలో కండరాల సమస్యకే కాకుండా పూర్తి ఆరోగ్యానికి మంచిది.

Advertisement

Next Story