- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకస్మికంగా ఏడవడం, నవ్వడం చేస్తున్నారా?.. అయితే ఈ వ్యాధి ఉన్నట్లే !!
దిశ, ఫీచర్స్: సినిమా చూస్తున్నప్పుడు తీవ్రంగా ఏడుస్తున్నారా? అసలు పరిస్థితులతో సంబంధం లేకుండా పగలబడి నవ్వుతున్నారా? అయితే మీరు Pseudobulbar Affect (PBA) అనే వ్యాధితో బాధపడుతున్నట్లే. మెదడు నరాలను ప్రభావితం చేసే ఈ అరుదైన రుగ్మత.. అనియంత్రిత, అనుచితమైన నవ్వు లేదా ఏడుపునకు కారణమవుతుంది. ఈ ఎపిసోడ్స్ సాధారణంగా వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘటనతో సరిపోలకపోగా.. చాలా సందర్భాల్లో ఈ భావోద్వేగాలు తీవ్రంగా ఉండవచ్చు.
PBA(సూడోబుల్బార్ ఎఫెక్ట్)ని 'ఎమోషనల్ లాబిలిటీ', 'పాథలాజికల్ లాఫింగ్ అండ్ క్రయింగ్', 'కంపల్సివ్ లాఫింగ్ ఆర్ క్రయింగ్', 'ఎమోషనల్ ఇన్‌కంటినెన్స్' అని కూడా పిలుస్తారు. మెదడులోని నాడీ సంబంధిత సర్క్యూట్రీ దెబ్బతిన్న ఫలితంగా PBA ఏర్పడుతుంది. కాబట్టి దీనిని న్యూరోసైకియాట్రిక్ సిండ్రోమ్‌గా పరిగణించడం ఉత్తమం. ఇది డిస్‌ఫంక్షనల్ ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ వల్ల కలిగే బ్రెయిన్ సిచ్యుయేషన్. అంటే.. రోగులు దుక్కం, కోపం లేదా సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు. మెదడులోని సెరెబ్రో-పాంటో-సెరెబెల్లార్ మార్గంలో వివిధ ప్రాంతాలను ప్రభావితం చేయడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుండగా.. ఈ వ్యాధి మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల నుంచి దాని సెరెబెల్లమ్‌కు, నాడీ మార్గాలకు అంతరాయం కలిగిస్తుంది. మానవ భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడానికి దారితీస్తుంది.
PBA ఎవరిని ప్రభావితం చేస్తుంది?
PBA ఇప్పటికే అంతర్లీన నరాల పరిస్థితిని కలిగి ఉన్న పిల్లలు, పెద్దలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రోగితో పాటు కుటుంబ సభ్యులు, సంరక్షకులు కూడా చాలా సఫర్ అవుతుంటారు. బాధిత వ్యక్తి ఇతరులతో కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో.. సొసైటీ సర్కిల్స్ నుంచి వైదొలగడానికి దారి తీస్తుంది.
*PBAతో బాధపడుతున్న దాదాపు 50 శాతం మంది వ్యక్తులు అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) కలిగి ఉంటారు. ఇది శరీర కండరాలను బలహీనపరిచి, శారీరక పనితీరును ప్రభావితం చేస్తుంది.
* ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ కలిగిన వ్యక్తులలో దాదాపు 48 శాతం మంది PBAతో బాధపడే అవకాశం ఉంది.
* మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) ఉన్నవారిలో దాదాపు 46 శాతం మంది PBA ప్రభావితులే.
* అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం PBAకు గురయ్యే పరిస్థితులను కల్పించవచ్చు.
* PBA స్ట్రోక్, పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు కణితులు, మూర్ఛ, విల్సన్ వ్యాధి ఉన్న రోగులను కూడా PBA ప్రభావితం చేస్తుంది.
సూడోబుల్బార్ ప్రభావం.. చికిత్స
సూడోబుల్బార్ ఎఫెక్ట్‌కు ఎటువంటి నివారణా లేదు. కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని మందులు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. PBAకి సంబంధించిన ఏ చికిత్సలోనైనా ప్రధాన లక్ష్యం రోగిని ప్రభావితం చేసే ఎపిసోడ్‌ల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను తగ్గించడం. కొన్ని FDA-ఆమోదిత ఔషధాలలో.. డెక్స్ ట్రోమెథోర్ఫాన్ / క్వినిడిన్ సల్ఫేట్, యాంటి డిప్రెసెంట్స్ కాంబినేషన్ ఉండగా.. ఇవి సాధారణంగా డిప్రెషన్ చికిత్సకు అవసరమైన మోతాదుల కంటే తక్కువగా ఉంటాయి.
READ MORE
- Tags
- lifestyle