- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని తింటున్నారా.. అంతే సంగతి
దిశ, వెబ్‌డెస్క్ : శీతాకాలం వచ్చిందంటే చాలు చల్లదనానికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం తరచుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు పంచభక్ష పరమాన్నాలైనా నోటికి రుచించవు. ఏదైనా కారం కారంగా, నోటికి రుచికరంగా అనిపించే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. కానీ జలుబు, దగ్గు ఉన్న సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కెఫిన్
జలుబు, దగ్గు ఉన్నప్పుడు కాఫీ, టీ, శీతల పానీయాలు అస్సలు తాగకూడదు. వీటిని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలహీనపడుతుందట. అందుకే కెఫిన్ రిలేటెడ్ డ్రింక్స్ ని దరిదాపుల్లోకి కూడా చేరనివ్వొద్దు.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులను జలుబు ఉన్న సమయంలో అస్సలు తీసుకోకూడదట. అలా తీసుకుంటే శరీరంలో ఉన్న కఫం మందంగా మారి బయటకు వెళ్లడం కష్టమవుతుందట.
కారంగా ఉండే ఆహారాలు
జలుబు చేసినప్పుడు కారంగా ఉండే ఆహారాన్ని అస్సలు తినకూడదట. అలా తినడం వలన ఆ ఆహారంలో ఉండే క్యాప్సైసిన్ శ్లేష్మ ఉత్పత్తిని మరింత పెంచుతుందట. స్పైసీగా ఉండే ఆహారాన్ని తిన్న కాసేపు జలుబు నుండి ఉపశమనం పొందినప్పటికీ ఇది జలుబు తగ్గడంలో మాత్రం ఆలస్యం అవుతుందట.
చక్కెర
జలుబు, దగ్గు ఉన్నప్పుడు చక్కెరకు సంబంధించిన పానీయాలకు, ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలనే చెప్పుకోవాలి. జలుబు చేసినప్పుడు చక్కెర కలిపిన జ్యూస్ తాగితే అది తెల్ల రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుందట. అప్పుడు ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీ తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.