Relationship : భార్యాభర్తల గొడవతో లాభాలు.. ఓసారి చెక్ చేయండి!!

by Prasanna |   ( Updated:2023-02-15 10:25:03.0  )
Relationship : భార్యాభర్తల గొడవతో లాభాలు.. ఓసారి చెక్ చేయండి!!
X

దిశ, ఫీచర్స్: సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ కేవలం వెకేషన్స్, గిఫ్ట్స్, ఫ్యాన్సీ హోటల్స్‌లో డిన్నర్‌లకు మాత్రమే పరిమితం కావు ఇందులో విభేదాలు, వాదనలు కూడా సాధారణమే. ఒకవేళ వాదించుకున్నప్పటికీ ఒకరిపట్ల మరొకరు ప్రేమగా ఉంటేనే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది. ఈ ఆర్గ్యూమెంట్‌లో భాగస్వామి నిజమైన భావాలను వ్యక్తీకరించవచ్చని.. దీన్ని ఓపెన్, హానెస్ట్ కమ్యూనికేషన్‌గా పరిగణించాలంటున్న నిపుణులు.. ఇది మెరుగైన సంబంధాలను సృష్టిస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరు తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. బాధ్యతల్లో మునిగిపోయి, భాగస్వాములతో కమ్యూనికేట్ కావడానికి కూడా సమయం ఉండట్లేదు. ఈ క్రమంలోనే గొడవ జరుగుతుంది. కానీ పార్ట్‌నర్ భావోద్వేగాలు, మనోభావాలు, ఉద్యోగ షెడ్యూల్, కుటుంబ పరిస్థితులను అంగీకరించడం, గౌరవించడం ద్వారా ఇందుకు కారణమైన సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే మీరు వాదించినా ఓకే అంటున్నారు నిపుణులు. తద్వారా చాలా కాలంగా అణచివేయబడిన భావోద్వేగాలు, భావాలను ఎక్స్‌ప్రెస్ చేయొచ్చని, ఇలా చేయడం ద్వారా మీరు ఏం ఆలోచిస్తున్నారో భాగస్వామికి అర్థమవుతుందని చెప్తున్నారు. సమస్యను అర్థం చేసుకోవడం దాన్ని పరిష్కరించడంలో దీన్ని మొదటి అడుగు అనుకోవచ్చని సూచిస్తున్నారు.

1. వాదన తర్వాత తేలికగా ఉంటారు

మీ భాగస్వామితో వాదించేందుకు, పోరాడేందుకు కారణం మానసికంగా అలసిపోవడం. ఈ క్రమంలోనే వాగ్వాదం తర్వాత ఈ బాధ నుంచి విముక్తి అయినట్లు, మనసులో భారం తగ్గినట్లు అనిపిస్తుంది. కోపాన్ని వదిలించుకోవడానికి, ప్రశాంతతను పొందడానికి సహాయపడుతుంది. ఎమోషన్స్‌ రిలీజ్ కావడంతో పాటు ఇన్‌సెక్యూరిటీస్‌కు చోటు ఉండదు. కానీ గొడవ తర్వాత కూడా భాగస్వామి పట్ల గౌరవం, ప్రేమతో ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఎదుటివారి భావోద్వేగాలు కూడా ముఖ్యమే.

2. వినడం ద్వారా ఆగ్రహావేశాలు ఉండవు

సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం లభిస్తుంది. కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ద్వారా ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ లభించదు. మీ బాధ, నిరాశను వ్యక్తం చేయడంపై శ్రద్ధ వహించాలే తప్ప భాగస్వామి తప్పులను వెతికేందుకు చూడకూడదు. ఎందుకంటే మీ బాధేమిటో అర్థమయ్యేలా చెప్తే ఎదుటివ్యక్తి కచ్చితంగా అండర్‌స్టాండ్ చేసుకోగలరు. తను చేసే తప్పులను గుర్తించగలరు. అపార్థాలను వెంటనే తొలగించుకోవడం ద్వారా ఆగ్రహావేశాలకు తావులేకుండా బంధాలు మరింత బలంగా మారుతాయి.

3. మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది

సాధారణంగా భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య జరిగే వాదనలో గెలుపొందడం ద్వారా పొందేదేమీ లేదని గుర్తించుకోవాలి. అంటే ఆ గొడవ కచ్చితంగా సమస్యకు పరిష్కారంగా ఉండాలి. కానీ ఎత్తుకు పై ఎత్తు మాదిరిగా ఉండకూడదు. నిజంగా మీ భర్త/భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంటే కచ్చితంగా ఆ వ్యక్తి పట్ల కేరింగ్‌గా ఉంటారు. దయ, ఓర్పుతో ఉంటూ.. మెరుగైన బంధాన్ని కలిగి ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed