సాబుదానాల్లో ఆ పోషకాలు.. అధిక బరువును తగ్గిస్తాయా?

by Javid Pasha |
సాబుదానాల్లో ఆ పోషకాలు.. అధిక బరువును తగ్గిస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య చాలామంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. వివిధ ఆహారాలు, జీవన శైలిలో మార్పులు, జన్యుపరమైన లోపాలు, తినే రుగ్మతలు కూడా ఇందుకు కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వ్యాయామాలతోపాటు ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. అలాంటి పోషకాలు కలిగిన వాటిలో సాబుదానాలు కూడా ఒకటి. ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెప్తు్న్నారు.

సాబుదానాలను నీటిలో నానబెట్టి జ్యూస్ రూపంలోనూ, పాయసం రూపంలోనూ తీసుకోవచ్చు. పైగా ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎనర్జిటిక్‌గా ఉండటంతోపాటు బరువును కంట్రోల్లో ఉంచుతాయి. అంతేకాకుండా డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉండటంవల్ల ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా ఎక్కువ తినాలనే కోరికలను అడ్డుకుంటాయి. దీంతో పాటు సాబుదానాల్లోని పీచుపదార్థం మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొవ్వుశాతం కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి సాబుదానాలు మంచి ఆహారమని ఆయుర్వేదిక్ నిపుణులు పేర్కొంటున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed