Dizziness : డెన్‌గా కళ్లు తిరుగుతున్నాయా..? కారణం ఇదే కావచ్చు!

by Javid Pasha |   ( Updated:2024-11-16 14:56:45.0  )
Dizziness : డెన్‌గా కళ్లు తిరుగుతున్నాయా..? కారణం ఇదే కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : కొందరికి సడెన్‌గా నిద్ర మేల్కొన్నప్పుడు గానీ, కూర్చొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా పైకి లేచినప్పుడు గానీ కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. చూపు మసక బారడం, మైకం కమ్మిన అనుభూతి కలగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆరు పదుల వయస్సు దాటాకనే వచ్చేవి. అయితే ప్రస్తుతం ఏజ్‌తో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎందుకలా జరుగుతుంది? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా రక్త నాళాలు బలహీనంగా మారడం, మెదడు కణాలకు తగినంతగా ఆక్సిజన్ అందకపోవడం సమస్యలవల్ల కళ్లు లేదా తలతిరడం వంటివి సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా నిద్రలేచినప్పుడు, సడెన్‌గా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు గుండె శరీరంలోని అన్ని భాగాలకు బ్లడ్ పంప్ చేయడంలో కష్టపడుతుంది. అంటే ఇక్కడ కదలికల సందర్భంగా మీరు ప్లేస్ మారితో రక్తపోటు కూడా సహజంగానే మారుతుందని, దీనినే హోమియో స్టాసిస్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని శారీరక వ్యవస్థలు సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది.

ఇక మీరు అకస్మాత్తుగా బాడీ పొజిషన్స్ మార్చినప్పుడు బ్రెయిన్ చిన్నపాటి షాక్‌కు గురవుతుంది. దీంతో క్షణంపాటు మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతుందని, ఈ సందర్భంలోనే రక్తపోటులో హెచ్చు తగ్గులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని మూలంగానే మైకం కమ్మినట్లు అనిపించడం, కళ్లు తిరగడం వంటివి జరగవచ్చు. అలా జరగగానే మీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. అందుకోసం గోడ లేదా కిటికీని పట్టుకొని నిల్చోవచ్చు. అయితే అప్పుడప్పుడూ శరీరంలో పోషకాల లోపం, అధిక ఒత్తిడి, హర్మోన్ల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి కారణాలతో ఇలా కళ్లు తిరుగుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమయానికి తినడం, సరిగ్గా నిద్రపోవడం, తగినంతగా నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన జీవన శైలితో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అప్పటికీ పరిష్కారం లభించకపోతే మరేదైనా ఆరోగ్య సమస్యగా అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

మోకాళ్ల నలుపు పోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..!






Advertisement

Next Story