Weight Loss: ప్రశాంతంగా నిద్రపోతూ కూడా.. బరువు తగ్గొచ్చని తెలుసా..?

by Prasanna |
Weight Loss: ప్రశాంతంగా నిద్రపోతూ కూడా.. బరువు తగ్గొచ్చని తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య అధిక బరువు. కొందరు దీని కోసం రోజూ వ్యాయమం చేస్తూ.. డైట్‌ ఫాలో అవుతూ, కేలరీలు తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతామని అనుకుంటూ ఉంటారు. అయితే, ఇక నుంచి మీరు అంత కష్టపడకుండా.. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. సాల్క్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఇది స్పష్టమైంది. రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులను 11 గంటలు మాత్రమే నిద్రపోవాలని సలహా ఇచ్చారు. 16 వారాల తర్వాత, వీరి బరువు చెక్ చేస్తే 4 శాతం తగ్గినట్లు గుర్తించారు.

నిద్రపోతున్నప్పుడు క్యాలరీలు బర్న్‌ అవుతాయి..

మన నిద్రలోనూ శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది, అదే విధంగా కేలరీలను కూడా బర్న్‌ చేస్తుంది. నిద్రలో, ఒక వ్యక్తి గంటకు 65 కేలరీలు బర్న్ చేస్తాడు. అంటే 8 గంటల నిద్రలో 500కి పైగా కేలరీలు బర్న్‌ అవుతాయి. మీరు ఆ సమయాన్ని టీవీ చూస్తూ గడిపినట్లయితే, మీరు దాదాపు అదే మొత్తంలో కేలరీలు బర్న్‌ అవుతాయి. ఎంత బాగా విశ్రాంతి తీసుకుంటే కొవ్వు అంత త్వరగా తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed