మెనోపాజ్ ఆడవారికే కాదు, మగవారికి కూడా వస్తుందని తెలుసా?

by Jakkula Samataha |
మెనోపాజ్ ఆడవారికే కాదు, మగవారికి కూడా వస్తుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మెనోపాజ్ అనగానే అందరూ ఇది ఆడవారికి మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఈ సమస్య ఆడవారికే కాకుండా మగవారిలో కూడా ఉంటుందని మీకు తెలుసా? వయసు పెరిగే కొద్దీ ఆడవారిలో పలు మార్పులు అనేవి వస్తుంటాయి. అలాగే మగవారిలో కూడా కొన్ని హార్మోన్ల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం, ఈ క్రమంలో పురుషుల్లో అనారోగ్య సమస్యలు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటిది జరుగుతుందంట.

అయితే ఆడనవారిలో నెలసరి ఆగిపోతే మెనోపాజ్ అంటారు. మరి మగవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. పురుషులలో మెనోపాజ్ మగవారిలో మెనోపాజ్ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వస్తుంది. ఎక్కువగా 45 ఏళ్ల వయసులో వారికి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

మగవారిలో మెనోపాజ్ సమస్య వచ్చినప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోయి, అంగస్తంభన సమస్య ప్రారంభం అవుతుందంట. అంతే కాకుండా వీరు డిప్రెషన్, బరువు పెరగడం, ఎముకలు బలహీనంగా మారడం లాంటివి జరుగుతాయంట. అలాగే లైంగిక శక్తి తగ్గిపోయి, పొట్ట దగ్గర కొవ్వు పేరుకపోతుంది. శక్తి స్థాయిలు తగ్గిపోయి చాలా వీక్ అవ్వడం, చిరాకు, కోపం లాంటివి అధికంగా వస్తుంటాయంట.అందువలన టెస్టోస్టిరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉండేందుకు, మంచి ఆహారం తీసుకోవాలంట.

Advertisement

Next Story