- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోనే డైమండ్ ఫేషియల్.. ఇలా చేసుకోండి..!
దిశ, ఫీచర్స్: అందాన్ని కాపాడుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు రెట్టింపు అందం కోసం రసాయనాలు ఉన్న క్రీమ్‌లను వాడుతుంటారు. అలా వాడిన కొన్ని రోజుల తరువాత ముఖం డల్‌గా మారుతుంది. మచ్చలు, మొటిమలు వంటివి ఫేస్‌పై వస్తుంటాయి. అలా కాకుండా స్కిన్ నేచురల్‌గా మెరవాలంటే ఈ చిప్స్ ఫాలో అవ్వండి. ఇంట్లో ఉన్న పదార్ధాలతోనే డైమండ్ ఫేషియల్‌ను ఇలా తయారు చేయండి.
స్క్రబ్ ఇలా తయారు చేయండి: ఈ స్క్రబ్‌ను తయారు చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా పుల్లటి పెరుగును తీసుకోవాలి. అందులో 1 స్పూన్ కాఫీపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌పై రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా వారికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది.
పెరుగు, తేనె: పెరుగు ఆరోగ్యానికే కాదు అందం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పెరుగు, తేనే చర్మానికి ఎన్నో లాభాలను చేకూర్చుతుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పెరుగు, తేనే రెండిటిని కలిపి ముఖంపై రాయడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
టమాట, పెరుగు: కొద్దిగా టమాట గుజ్జులో కొద్దిగా పెరుగు కలపాలి. దీనిని ఫేస్‌పై రాస్తూ బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ప్రతీసారి కొంచెం కొంచె ముఖమంతా రాస్తూ మసాజ్ చేసుకొని వదిలేయాలి. 15 నిమిషాల తరువాత వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ పోయి అందంగా కనిపిస్తారు.