Diabetes: డయాబెటిస్‌‌కు ఇక గుడ్ బై.. పర్మినెంట్ సొల్యూషన్‌ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు

by Javid Pasha |
Diabetes: డయాబెటిస్‌‌కు ఇక గుడ్ బై.. పర్మినెంట్ సొల్యూషన్‌ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రధానంగా ఉంటోంది. ఒకప్పుడు నడీడు వయస్సులో వారికే ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అనేకమంది దీని బారిన పడుతున్నవారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే ఆ తర్వాత పూర్తిగా నయం కావడం కష్టం. దానిని అదుపులో ఉంచుకోవడానికి ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడం, మందులు యూజ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. కానీ సమీప భవిష్యత్తులో అలాంటి ఆందోళన ఉండకపోవచ్చు. ఎందుకంటే డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగల చికిత్సా మార్గాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధనల్లో టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాప్పిటల్, పెకింగ్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకుల బృందం పాల్గొన్నది.

సాధారణంగా డయాబెటిస్ రెండు రకాలు. ఇందులో ఒకటి టైప్ -1, కాగా రెండవది టైప్ -2, కాగా మొదటిది మరింత ప్రమాదకరం. దీనివల్ల షుగర్ పేషెంట్ల ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కాబట్టి వీరు లైఫ్‌లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇక రెండవ రకం టైప్ - 2 డయాబటిస్‌కు అయితే అలాంటి అవసరం లేదు. కొన్ని రకాల జీవనశైలి మార్పులు, ఆహారపుల అవాట్లను నియంత్రించడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో ప్రమాదకరమైన టైప్ -1 డయాబెటిస్ బాధితులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తాజాగా చైనా శాస్త్రవేత్తలు దానికి పరిష్కారాన్ని కనుగొన్నారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా ఓ 25 ఏండ్ల మహిళా రోగిలో ‘టైప్ -1’ డయాబెటిస్‌ను వారు పూర్తిగా తగ్గించినట్లు చైనీస్ వార్తా పత్రిక ‘ది పేపర్’ నివేదిక పేర్కొన్నది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. బాధితురాలిలో స్టెమ్ సెల్ మార్పిడి శస్త్ర చికిత్సకు అరగంట పట్టిందని, ఆ తర్వాత రెండున్నర నెలల కాలంలోనే ఆమెలో షుగర్ లెవల్స్ పూర్తిగా అదుపులోకి వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు ఏం చేశారంటే..

టైప్ -1 మధుమేహానికి శాశ్వత పరిష్కారం చూపే పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మరణించిన దాత ప్యాంక్రియాస్ నుంచి ఐలెట్ కణాలను సేకరించారు. ఆ తర్వాత టైప్ -1 బాధిత రోగి కాలేయంలో వాటిని అమర్చగా ఇన్సులిన్, గ్లూకాన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా అవి షుగర్ పేషెంట్ రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రించాయి. దీంతో సదరు రోగిలో డయాబెటిస్ పూర్తిగా నయం అయింది. కాగా స్టెమ్‌సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా ఇలా నయడం చేయడం సాధ్యమే అయినప్పటికీ ప్రస్తుతం అందుకు తగిన వనరులు అంతగా అందుబాటులో లేవు. అంటే ప్యాక్రియాస్ దాతలు దొరకడమే ఇప్పుడు కష్టం. దాతలు ముందుకు వస్తే డయాబెటిస్‌ను పూర్తిగా నయంచేయగల వ్యాధేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సందర్భంలో స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా డయాబెటిస్ చికిత్సకు కొత్త మార్గాలు కనిపిస్తున్నాయని, రసాయనికంగా ప్రేరేపించిన ప్లూరిపోటెంట్ స్టెమ్‌సెల్ ఉత్పత్తి చేసే విధానం గురించి పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో మధుమేహం వల్ల అస్సలు భయం ఉండదు. ఎందుకంటే దానిని తగ్గించే పర్మినెంట్ సొల్యూషన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ వచ్చినా చికిత్స ద్వారా పూర్తిగా నయంచేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

Also Read: ఫేస్‌పై వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న 6 ఫ్రూట్స్

Next Story

Most Viewed