- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Diabetes : డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. పాదాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో అనేకమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా దీని కారణంగా 15 శాతం మంది ఇన్ఫెక్షన్లు సోకి ఫుట్ అల్సర్లకు గురవుతున్నారని, పాదాలను తొలగించుకుంటున్న పరిస్థితిని ఏర్పడుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. పాదాలకు గాయాలు కావడం, పరిశుభ్రత పాటించకపోవడం, సాక్సులు వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటివి ఇందుకు కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఏ విధమైన కేర్ తీసుకోవాలో సూచిస్తున్నారు.
* డయాబెటిక్ పేషెంట్లలో పాదాలు రంగు మారడం, చీలమండ వాపు, కాళ్లల్లో నొప్పి, పుండ్లు ఏర్పడటం, గోర్లు ఎక్కువగా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు సాక్స్ వేసుకునే ముందు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా డైలీ అవే సాక్సులు అస్సలు వాడకూడదు. ఉతికినవి లేదా కొత్తవి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
* డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వారు పాదాలను డైలీ గోరు వెచ్చని నీరు, సబ్బుతో శుభ్ర పర్చుకోవాలి. స్నానం చేసినప్పుడు, వర్షంలో తడిసి వచ్చినప్పుడు పాదాలపై తడిలేకుండా వెంటనే తుడుచుకోవాలి. లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు డెవలప్ కావచ్చు.
* కాలి గోర్లను కత్తిరించేటప్పుడు శుభ్రమైన నెయిల్ కట్టర్‌ను మాత్రమే వాడాలి. ఒకవేళ నొప్పిగా అనిపిస్తే గోర్లు తీయడం ఆపివేయాలి. తర్వాత డాక్టర్ల సలహా పాటించాలి. అలాగే పాదాలపై జిడ్డుతో ఇబ్బంది పడుతుంటే తడిగా ఉండే ప్యూమిస్ స్టోన్‌తో సున్నితంగా రుద్దడం ద్వారా తొలగించుకోవచ్చు.
* చెప్పులు లేదా షూలు వాడేటప్పుడు పాదాలకు సరిపడా పొడవు, వెడల్పు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. లేకుంటే వాటి రాపిడివల్ల గాయాలు, పుండ్లు ఏర్పడవచ్చు. అలాగే పాదాలలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలంటే డైలీ 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి.