నో ఫికర్.. పిల్లల ఆర్థిక కష్టాల్లో లక్షలకు లక్షలు సర్దుబాటు చేసేది తల్లిదండ్రులే

by samatah |   ( Updated:2023-06-23 12:28:28.0  )
నో ఫికర్.. పిల్లల ఆర్థిక కష్టాల్లో లక్షలకు లక్షలు సర్దుబాటు చేసేది తల్లిదండ్రులే
X

దిశ, ఫీచర్స్ : ఆటంకాల సుడిగుండాలు ఎదురైనప్పుడు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనల్ని ఆదుకునేవారు ఎవరా?.. అని ఆలోచిస్తే కళ్లమందు కదలాడే మొదటి వ్యక్తులు తమ పేరెంట్స్ మాత్రమేనని అత్యధిక మంది అంగీకరిస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. ఏదో ఒక సందర్భంలో ప్రతికూల పరిస్థితులు మనుషులను వేధిస్తుంటాయి. ఇలా చాలామందిని వేదించే సమస్యల్లో ఆర్థికపరమైనవే ఉంటాయి. నెలకు రెండుమూడు లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా ఒక్కోసారి 10 వేల రూపాయలు సర్దుబాటుకాక ఆ క్షణంలో సహాయం కోసం ఎదురుచూస్తారు. అయితే ఇటువంటి అనేక సందర్భాల్లో చాలామంది యువతీ యువకులు, పెద్దలు కూడా తమ పేరెంట్స్‌పైనే ఆధారపడుతున్నారని ‘చార్ట్‌వే క్రెడిట్ యూనియన్-వన్‌పోల్’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే తట్టుకోలేని పేరెంట్స్ రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టిన డబ్బులు ఒకానొక ఆపద సమయం వచ్చిందంటే ఏమాత్రం ఆలోచించకుండా పిల్లలకు ఇచ్చేస్తారని అధ్యయనం చెప్తోంది. అయితే ప్రతీ 10 మంది యువతలో తొమ్మిది మంది ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పటికీ.. ఏదో ఒక సందర్భంలో పేరెంట్స్‌పై ఆధారపడుతున్నారు. సమయానికి డబ్బుల్లేక పోవడంతో ఆయా బిల్లులు చెల్లించడానికి ప్రపంచ వ్యాప్తంగా 35 శాతం మంది ఇప్పటికీ తమ తల్లిదండ్రులనే ఆశ్రయిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ఇక 19 శాతం మంది మొదటి మూడు సందర్భాల్లో అద్దె ఖర్చుల కోసం, కిరణా సామాన్ల కోసం ఆధారపడుతున్నట్లు తెలిపింది అధ్యయనం.

Read More... అనవసరంగా పోలీసులు మనల్ని కొట్టినా, తిట్టినా అది నేరమే తెలుసా

ఈ కారణంతోనే భార్య పరాయి మగవాడిపై ఆశపడుతుంటారంట?

Advertisement

Next Story