Depression: డిప్రెషన్ సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

by Prasanna |   ( Updated:2023-03-03 10:11:41.0  )
Depression: డిప్రెషన్ సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
X

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడటం, నిరాశకు లోనవ్వటం సహజమే. కొద్దిరోజుల తర్వాత వాటి నుంచి నెమ్మదిగా కోలుకుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి భావనలు రోజు రోజుకీ ఎక్కువవుతూ ఉండొచ్చు. ఇవి డిప్రెషన్‌ లక్షణాలు కావొచ్చు. ఇది తీవ్రమైన సమస్య. మానసిక బాధకు రకరకాల అంశాలు దారితీస్తుంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలు, ఆత్మీయులను కోల్పోవటం, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదురవ్వటం లాంటి పరిస్థితులు మనిషిని బాగాకృంగిపోయేలా చేస్తాయి. క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఉన్న జబ్బులను మరింత ఎక్కువయ్యేలా చేస్తుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

అదేపనిగా విచారం, బాధ, ఆందోళన కలుగుతుండటం. మనసు వెలితిగా అనిపించటం. నిరాశ, నిస్పృహకు లోనవ్వటం. చిరాకు పడటం, విసుక్కోవటం, ప్రశాంతత కోల్పోవడటం. తమను తాము నిందించుకోవటం, దేనికీ పనికిరానని అనుకోవటం. నిద్ర పట్టకపోవటం, తెల్లవారుజామున్నే మెలకువ వచ్చేయటం. లేదూ అతిగా నిద్రపోవటం. ఆకలి తగ్గటం లేదా పెరగటం. అకారణంగా బరువు పెరగటం లేదా తగ్గటం. స్పష్టమైన కారణాలేవీ లేకుండా నొప్పులు, తలనొప్పి, కండరాలు పట్టేయటం, జీర్ణకోశ సమస్యలు తలెత్తటం. ఇలాంటి లక్షణాలతో రెండు వారాలకు పైగా బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల.

ఇవి కూడా చదవండి : ఇంటి ముందు బంతిపువ్వుతో రంగోలీ వేస్తే ఆ భగవంతుడి కటాక్షం ఉన్నట్లే!

Advertisement

Next Story

Most Viewed