Dengue Vaccine : డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇప్పటికే తీసుకున్న పది వేల మంది ఇండియన్స్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-10 15:16:13.0  )
Dengue Vaccine : డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇప్పటికే తీసుకున్న పది వేల మంది ఇండియన్స్..
X

దిశ, ఫీచర్స్: ఇండియాలో డెంగ్యూ కారణంగా ఏటా వేల మంది చనిపోతున్నారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు DengiAll వ్యాక్సిన్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. Panacea Biotech.. USA నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ పై ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. డెంగీఆల్ డెంగ్యూకి కారణమయ్యే లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సబ్టైప్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

ఇక ఇప్పటికే భారత్ లో ట్రయల్స్ మొదలయ్యాయి. పూణే, చెన్నయ్, ఢిల్లీ ప్రాంతాల్లో దాదాపు 19 సైట్లలో.. 18-60 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొన్నారు. కాగా జరిగిన ప్రతి చోటా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్ DengiAll ట్రయల్ సేఫ్ అని తేలడంతోపాటు స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కలిగి ఉందని గుర్తించబడింది. డెంగ్యూ అవుట్ బ్రేక్స్ లో గేమ్ చేంజర్ గా మారుతుందని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ లో 32వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.


Advertisement

Next Story

Most Viewed